జెత్వానీ స్నేహితుడు అమిత్ సింగ్ పై వైకాపా ఫేక్ కేసు
Publish Date:Sep 30, 2024
Advertisement
గత వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ముంబైకు చెందిన సినీ నటి జెత్వానీపై రేప్ కేసు అందరికీ తెలిసిందే. ఈ కేసు నమోదైన నేపథ్యంలో జిందాల్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ సిఎం జగన్ తాను అధికారంలో ఉండగానే పావులు కదిపారు. జెత్వానీపై అక్రమ కేసులు బనాయించారు. జిందాల్ ను కాపాడటానికి తన పార్టీకి చెందిన కుక్కల విద్యాసాగర్ ను రంగంలో దింపారు. ముంబైలో జిందాల్ పై జెత్వానీ కేసు పెడితే ఎపిలో పావులు కదిపిన జగన్ జెత్వానీతో బాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్ జెత్వానీను వేధింపులకు గురి చేశాడు. ఆమెపై అక్రమ కేసులు బనాయించాడు. ఇంతటితో ఆగక జెత్వాని స్నేహితుడు అమిత్ సింగ్ పై ఫేక్ కేసు నమోదు చేయించిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. వైకాపా హాయంలో నమోదైన ఈ కేసు కూటమి ప్రభుత్వ హాయంలో బయటపడింది. అమిత్ సింగ్ వ్యభిచారం కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసు నమోదైన సమయంలో అమిత్ సింగ్ ఢిల్లీలో ఉన్నట్లు వెల్లడైంది. అపట్లో ఓ స్పా కేంద్రంలో వ్యభిచారం కేసు నమోదైంది. ఈ వ్యభిచారం కేసులో అమిత్ సింగ్ విటుడు అని పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. గోప్యంగా ఉన్న ఈ కేసు ఇప్పుడు బయటపడింది.
http://www.teluguone.com/news/content/a-case-of-adultery-against-jethwan-friend-amit-singh-25-185884.html





