అమ్మానాన్నలతో గొడవ.. ఆరేళ్ళు కష్టం.. తన సొరంగం రహస్యం..
Publish Date:May 31, 2021
Advertisement
ఇంట్లో పిల్లలకు, పెద్దవాళ్ల మధ్య గొడవలు సహజం. ఈ పెద్దోళ్లు ఉన్నారే.. పిల్లల మనసు ఎప్పడు అర్థం చేసుకోరు అని చెప్పినట్లు. పెద్దలకు కోపం వస్తే గట్టిగా తిడతారు. అరుస్తారు. అప్పుడప్పుడు చేయి కూడా వేసుకుంటారు. మరి. అదే పిల్లలకు కోపం వస్తే అలుగుతారు. గదిలోకి వెళ్లి ఏడుస్తారు. ఇంట్లో గడవ పడితే అమ్మాయి అయిన, అబ్బాయి అయిన ఏంచేస్తారు.. ఆ కాసేపు కోపంతో ఇంట్లో నుండి వెళ్లి పోయి ఏ అన్నం తినే టైం కో లేదంటే రాత్రికో తిరిగివస్తారు. ఇంకొంత మంది అయితే ఏ ఫ్రెండ్ ఇంటికో, బంధువుల ఇంటికో వెళ్లి అక్కడ కొన్ని రోజులు తిరిగి ఇంటికి ఉంది వస్తారు. ఇంకొంత మంది అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఒకటి సాధించుకుని, వాళ్ళు ఏంటో నిరూపించుకుని వస్తారు. ఈ మధ్య కాలం లో అయితే పిల్లలు తిట్టినా సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే, ఆ యువకుడు మాత్రం ఇవేవీ చేయలేదు. పలుగు, పార పట్టుకుని తన గార్డెన్లోనే గొయ్యి తీయడం మొదలుపెట్టాడు. అలా తవ్వుతూ తవ్వూతూ ఆరేళ్లు గడిపేశాడు. ఆ గొయ్యి ఇప్పుడు సొరంగమైంది. అంతేకాదు.. దాన్ని అతడు గెస్ట్ హౌస్గా మార్చేసుకున్నారు. అంతే కాదు అందులో ఒక సిట్టింగ్ రూమ్, టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతని పేరు ఆండ్రెస్ క్యాంటో. 2015లో 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అంటే తనను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు దుస్తులు మార్చుకోమని తెలిపారు. అయితే, క్యాంటో మాత్రం ట్రాక్ సూట్లోనే వస్తానని తెలిపాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో తల్లి దండ్రులకు కోపం వచ్చింది. క్యాంటో ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో వారు మాత్రమే గ్రామానికి వెళ్లారు. క్యాంటో కూడా కోపం వచ్చింది.. ఆ కోపంలో అందరి లాగ తాను చెయ్యలేదు. చివరికి సూసైడ్ కూడా చేసుకోలేదు. తనకు వచ్చిన కోపంతో తమ గార్డెన్లో గొయ్యి తవ్వాడు. ఆ పని అతడికి ఎందుకు నచ్చిందో ఏమో తెలీదు. రోజూ స్కూల్ నుంచి రాగానే యుద్ధం చేసినట్లు అదే ప్రాతిపాదికన ఆ పని చేసేవాడు. ఏ రోజు విశ్రాంతి కూడా తీసుకోలేదు. అలిసిపోలేదు. వెనక్కి తిరగలేదు. విసుగురాలేదు. తన సంకల్పంతో చివరికి అతడు ఆ గొయ్యిని పెద్ద సొరంగంలా మార్చాడు. రాముడికి ఉడతా సహాయం చేసినట్లు అతనికి అతడికి స్నేహితుడు కూడా తోడయ్యాడు. గోతులను తవ్వేందుకు ఉపయోగించే యంత్రాన్ని తీసుకొచ్చాడు. దీంతో క్యాంటో పని మరింత సులభమైపోయింది. ఇప్పుడు క్యాంటోకు 20 ఏళ్లు. ఇప్పుడు ఆ సొరంగం భలే అందంగా ఉంది. అందులో ఒక సిట్టింగ్ రూమ్, బాత్రూమ్ కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా క్యాంటో మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు ఊరు వెళ్దాం దుస్తులు మార్చుకో అన్నారు. కానీ, నాకు ట్రాక్సూట్లో వెళ్లడమే ఇష్టమని చెప్పాను. వాళ్ళు వినలేదు ,అలాగైతే మాతో ఊరు రావద్దని చెప్పేశారు. నేను పర్వాలేదు, నన్ను నేను ఎంటర్టైన్ చేసుకోగలను అంటూ ఇంటి వెనుక గార్డెన్లోకి వెళ్లి తవ్వడం మొదలుపెట్టాను. నా పనికి ఫ్రెండ్ అండ్రూ కూడా తోడయ్యాడు. ఓ రోజు 14 గంటల్లోనే 3 మీటర్ల గొయ్యి తవ్వేశాం. ఇప్పుడు నా సొరంగంలో వైఫై, హీటింగ్ సిస్టమ్ కూడా ఉంది. కానీ, ఆ గొయ్యిని అంతలా తవ్వడానికి కారణం ఏమిటో తలుచుకుంటే నవ్వొస్తోంది’’ అని తెలిపాడు. ఇప్పుడు క్యాంటో తవ్విన సొరంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన స్పెయిన్లోని లా రొమానా లో జరిగింది.
http://www.teluguone.com/news/content/a-boy-underground-cave-in-6-years-after-fight-with-parents--39-116676.html





