80 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సింధూర్ కు ప్రపంచ దేశాల మద్దతు!

Publish Date:May 7, 2025

Advertisement

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం (మే 6) అర్ధరాత్రి తరువాత భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపుదాడులకు ఆపరేషన్ సింధూర్ అని నామకరం చేసింది. కచ్చితమైన లక్ష్యాలపై అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ డాడుల్లో  కనీసం 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.  
ఐక్యరాజ్యసమితి నిషేధించిన   జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థలకు చెందిన మొత్తం   తొమ్మిది స్థావరాలు  లక్ష్యంగా జరిగిన ఈ దాడులు విజయవంతమయ్యాయి.  
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు  జైషే మహమ్మద్‌కు బలమైన పట్టున్న బహవల్పూర్, లష్కరే తోయిబా కీలక కేంద్రమైన మురిడ్కేలోని మసీద్ వా మర్కజ్ తైబాపై జరిగిన దాడుల్లో  పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.  ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారు50 నుంచి 60 మంది  ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా.  లక్షిత దాడులకు గురైన   ప్రాంతాల్లో మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ధృవీకరించాల్సి ఉంది.

అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నత స్థాయి భద్రతా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్ లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.  ఈ దాడులను పాకిస్థాన్ ధృవీకరించడమే కాకుండా తీవ్రంగా ఖండించింది. దీనిని యుద్ధ చర్యగా అభివర్ణించింది.  ఈ దాడుల్లో ఒక చిన్నారితో సహా ఎనిమిది మంది పౌరులు మరణించారని ఆరోపించింది. ఈ దాడుల అనంతరం, పాకిస్థాన్ దళాలు జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భారీగా కాల్పులకు, మోర్టార్ల దాడులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు కూడా దీటుగా స్పందించాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. 

కాగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను అగ్రరాజ్యం అమెరికా సమర్ధించింది.  ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ భారత్ కు మద్దతు ఇవ్వాలని సూచించింది. కాగా ఆపరేషన్ సింధూర్ పై భారత్ ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చింది. నిషేధిత ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ సక్సెస్ ఫుల్ గా దాడులు చేసినట్లు తెలిపింది. 

భారత్ ఆపరేషన్ సింధూర్ ను ఇజ్రాయెల్ సమర్ధించింది. భారత్ ఆత్మరక్షణ కోసమే దాడి చేసిందని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి పేర్కొన్నారు.  అయామకులపై దాడులు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని ఉగ్రవాదులు గ్రహించాలని పేర్కొన్నారు.  

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.