బతుకమ్మ చీరకు బదులుగా 500 రూపాయలు ?
Publish Date:Sep 25, 2024
Advertisement
రానున్న బతుకమ్మ పండగ నేపథ్యంలో రేవంత్ సర్కార్ బతుకమ్మ చీరలకు బదులుగా ఐదువందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. బతుకమ్మ చీరలు లబ్దిదారులకు అందకుండా పోతున్నాయని రేవంత్ సర్కార్ వద్ద సమాచారం ఉంది. లెక్కల్లో చీరల సంఖ్య బరాబర్ ఉన్నప్పటికీ లబ్దిదారులకు చేరడం లేదు. బతుకమ్మ చీరలను చాలామంది కట్టుకోవడం లేదని ప్రభుత్వం భావిస్తుంది. బతుకమ్మ చీరలను తీసుకున్న మహిళలు వాటిని కట్టుకోకుండా ఓ మూలన పడేస్తున్నారని ప్రభుత్వ విచారణలో తేలింది. దీన్ని అరికట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చీరలకు బదులు ఐదొందల నగదును ఇవ్వాలని భావిస్తుంది.రేషన్ కార్గు ఉన్న ప్రతీకుటుంబానికి ఐదొందలు అందనున్నాయి. బతుకమ్మ చీరలను అందించే సాంప్రదాయం గత కెసీఆర్ ప్రభుత్వం పరిచయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తే ఆ క్రెడిట్ బిఆర్ఎస్ కు వెళ్లిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు రేవంత్ నిర్ణయంపై బిఆర్ఎస్ భగ్గుమంటోంది. తెలంగాణలో మహిళలకు చీరలు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం ఉందని బిఆర్ఎస్ గుర్తు చేస్తోంది. బతుకమ్మ చీరలను పంచడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందని బిఆర్ఎస్ వాదన. అయితే ఈ వాదన తిప్పికొట్టే ప్లాన్ లో కాంగ్రెస్ లో ఉంది. గుజరాత్ నుంచి దిగుమతి చేసుకున్న చీరలను గత కెసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/500-rupees-instead-of-bathukamma-saree-39-185557.html





