ట్రంప్ బర్త్‌డే.. రూ.500 కోట్లతో కేజ్ ఫైట్
Publish Date:Jun 13, 2026
Advertisement
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ 80వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడానికి వైట్ హౌస్‌లో భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ చరిత్రలోనే తొలిసారిగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ) కేజ్ ఫైట్ నిర్వహించనున్నారు. ఆదివారం (జులై 14) ట్రంప్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఈ ఈవెంట్‌కు 60 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు 500 కోట్ల రూపాయలు చేయనున్నారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4) పురస్కరించుకుని ఈ ఈవెంట్‌కు యూఎఫ్సీ ఫ్రీడమ్ 250 అని పేరు పెట్టారు. ట్రంప్ సన్నిహితుడు యూఎఫ్‌సీ సీఈఓ డానా వైట్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుంది . బోన్లలో నిర్వహించే ఈ పోటీలంటే ట్రంప్‌కు ఎంతో ఇష్టం. గతంలో చాలాసార్లు ఆయన ఆ పోటీలను వీక్షించారు. ఈ పోటీలో పలు దేశాలకు చెందిన ప్రముఖ ఫైటర్లు తలపడనున్నారు. యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250 కోంస వైట్ హైస్ ప్రాంగణంలో ది క్లా పేరుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. 92 అడుగుల ఎత్తు, 154 అడుగుల వెడల్పు, 600 టన్నుల మెటల్‌తో భారీ స్థాయిలో తాత్కాలిక పైకప్పు నిర్మించారు. వేదిక మధ్యలో యూఎఫ్‌సీ ఫైటింగ్ కేజ్‌తో పాటు, నలుగే వేల మంది కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సామాన్యలు వీక్షించేందుకు వైట్‌హౌస్ బయట భారీ స్క్రీన్‌లు పెట్టారు. అయితే ఈఫిల్ టవర్‌లా ఆ తాత్కాలిక నిర్మాణం శాశ్వతం ఉండిపోతుందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ పుట్టిన రోజు పేరుతో వైట్ హౌస్‌లో యూఎఫ్‌సీ పోటీల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు క్రీడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే అందులో జోక్యం చేసుకోవడానికి స్థానిక డిస్ట్రిక్ కోర్టు నిరాకరించింది. మరోవైపు ఈ కార్యక్రమాన్ని సమర్ధించుకుంటున్న వైట్‌హౌస్ వర్గాలు, నిర్వహణ ఖర్చంతా యూఎఫ్‌సీనే భరిస్తోందని చెప్తున్నారు.
http://www.teluguone.com/news/content/500-crore-cage-fight-36-222877.html





