ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలిసిపోయినట్టే..!
Publish Date:Mar 11, 2017
Advertisement
ఐదు రాష్ట్రాలైన గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కాగా, చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్ లో పూర్తి ఫలితాలు మధ్యాహ్నం 12 లోగా వెల్లడి కావచ్చని..ఆపై ఉత్తరాఖండ్ ఫలితాలు ఒంటి గంటకూ, పంజాబ్ ఫలితాలు 3 గంటలకు, ఉత్తరప్రదేశ్ ఫలితాలు సాయంత్రం 5 గంటల్లోపు వెలువడవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దాదాపు ఫలితాలు తెలిసిపోయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటగా, గోవాలో ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో అయితే బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అంతేకాదు ఉత్తర ఖండ్ లో కూడా బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతుంది. మణిపూర్లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఇక స్థానాలు, ఫలితాల వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్: మొత్తం స్థానాలు 403 పంజాబ్: పంజాబ్: మొత్తం స్థానాలు 117 ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్: మొత్తం స్థానాలు 70 మణిపూర్: మణిపూర్: మొత్తం స్థానాలు 60 (ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 39) గోవా: మొత్తం స్థానాలు 40 ( ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 23)
బీజేపీ - 293, సమాజ్ వాదీ, కాంగ్రెస్ - 83, బీఎస్పీ - 18, ఇతరులు - 8
కాంగ్రెస్ - 65, అకాలీదళ్, బీజేపీ - 27, ఆప్ 25
బీజేపీ - 55, కాంగ్రెస్ - 9, ఇతరులు - 6
బీజేపీ - 14, కాంగ్రెస్ - 18, వామపక్షాలు - 2, ఇతరులు - 5
గోవా:
బీజేపీ - 8, కాంగ్రెస్ 11 (1 గెలుపు), ఇతరులు - 4
http://www.teluguone.com/news/content/5-states-elections-39-72822.html





