సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 47 మంది తెలుగు వైద్యుల లేఖ

Publish Date:May 19, 2021

Advertisement

తెలుగు రాష్ట్రాలకు చెందిన 47 మంది వైద్యులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తమ అభిప్రాయాలను  అందులో పొందు పరిచారు. దేశంలో కరోనా సంక్షోభం మీద తెలుగు ప్రగతిశీల వైద్యుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాసింది. దేశంలో నానాటికీ కరోనా విజృంభణ పెరిగిపోవడానికి.. సెకండ్ వేవ్ కు అధికారులు, నాయకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని చెబుతూ.. దీని నివారణకు, కట్టడికి తీసుకోవాల్సిన కొన్ని సలహాలు, సూచనలు పొందుపరిచారు. ఆ లేఖ.. ఈ క్రింత యధాతథంగా మీ కోసం...

శ్రీయుత గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ , సుప్రీంకోర్టు , ఇండియా గారికి,
విషయం : ఇండియాలో కరోనా వైరస్ సంక్షోభం గురించి....
సర్,
మేము ప్రగతిశీల డాక్టర్లుగా మన దేశంలో కోవిద్-19 వల్ల తలెత్తిన పరిస్థితి మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.
 మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిద్ -19 రెండో ప్రళయాన్ని అధిగమించడంలో విఫలం అయ్యాయి. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన మూలంగా దేశంలో కోవిద్ కేసులు విపరీతంగా పెరిగాయి. కోవిద్-19 మొదటి వేవ్ అదుపులోకి రాకముందే ప్రభుత్వాలు మత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే కూడా సిబ్బంది నియామకం, ఆక్సిజన్ సరఫరా, బెడ్ల పెంపుదల, మెడిసిన్ అందుబాటులోకి తేవడం లాంటి వాటి గురించి ప్రభుత్వాల దగ్గర కనీస కార్యక్రమం లేదు. కోవిద్-19 రెండవ వేవ్ వస్తుందని ఊహాగానాలు ఉన్నప్పటికీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వేవ్ ని ఎదుర్కోడానికి సిద్ధం కావడంలో పూర్తిగా విఫలమయ్యాయి.ఈ మహమ్మారి భయంకరమైన ప్రభావంతో రోజుకి 1500 నుండి 3000 మరణాలు సంభవించాయి. దేశంలో ఏప్రిల్ 15 నుండి ప్రతి రోజు 2 లక్షల కేసులు నమోదు అవుతూ ఏప్రిల్ 27 నాడు 3 లక్షల 60 వేల 960 తో ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదైన దేశంగా ఘనతకెక్కింది.

దేశంలో కోవిద్-19 కేసుల సంఖ్య వరుసగా ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, ఇది సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు , డిసెంబర్ 19న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4న భారత్ 2కోట్ల మైలు రాయిని దాటింది.తప్పుడు లెక్కలు చూపించడానికి ఉత్తరప్రదేశ్ లో శవాలను నదుల్లోకి విసిరివేస్తున్నారు. మేము మీడియాలో చూసిన దాని ప్రకారం గంగా , యమునా నదుల్లో శవాలు తేలుతున్నాయి.చాలా తక్కువ సంఖ్యలో కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ అనే రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కూడా కొరత ఉన్నాయి. కోవిన్ అప్లికేషన్లో టీకా వేపించుకోటానికి సమయం కేటాయించబడటం లేదు. మొదటి డోసు ఇచ్చిన వారికి రెండో డోసు దొరకని పరిస్థితి ఉన్నది.

వ్యాక్సిన్ల కొరకు వెళ్లి కోవిద్ బాధితులుగా తిరిగివస్తున్న వైనం కనిపిస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు, టీకా ఇచ్చే కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటం ప్రధాన కారణం. ప్రభుత్వాలు ప్రజల పట్ల తమ ప్రాథమిక బాధ్యతలను , విధులను గాలికి వదిలేసి ప్రజల బాధలను తగ్గించడానికి ఏ మాత్రం కూడా కృషి చెయ్యట్లేదు.మరణాల రేటు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కోవిద్-19 లింకును అడ్డుకోటానికి సిద్ధంగా లేవు. గణాంకాల ప్రకారం వైద్య సిబ్బంది సరిపడినంత లేరు, ఇప్పుడున్న వారితో రోగులకు చికిత్స చేయటం కష్టంతో కూడుకున్నది. తక్షణమే వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలి. కోవిద్-19 మహమ్మారి తీవ్రతరం కావటానికి ప్రధాన కారణం పాలకులు వైఫల్యమే.
ఆ వైఫల్యాలను అధిగమిస్తూ సమస్యకు పరిష్కార మార్గాలు చేపట్టాలి. దేశంలోని ప్రజలకు పెద్ద సంఖ్యలో వైరస్ సంక్రమిస్తుంది తత్ఫలితంగా మరణాలు కూడా తీవ్ర స్థాయిలో సంభవిస్తున్నాయి. తగిన సమయంలో ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు ఇవ్వటానికి నిర్ణిత సమయంలో కొనుగోలు చేయడంలో/ ఆర్డర్ ఇవ్వడంలో విఫలం అయింది.

ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తూ చానా కాన్షస్ గా ప్రజోపయోగం లేని ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తోంది. ఆ సంక్షోభంలో కూడా మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల ప్రతినిధులు ఎం.పి , ఎం.ఎల్.ఏ, మంత్రులు అశాస్త్రీయ భావజాలాన్ని ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. కోవిద్-19 సంక్రమించకుండా, బాధితులు ఉపశమనం పొందాలంటే ఆవు మూత్రం త్రాగాలని , ఆవు పేడ మర్దన చేయాలని బహిరంగంగా ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A[h] లో ప్రతి పౌరుడిలో సైంటిఫిక్ టెంపర్ అభివృద్ధి చేయడం కర్తవ్యంగా పేర్కొంటుంది. లౌకిక వాదం, మానవతా వాదం, విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి సైంటిఫిక్ టెంపర్ సహాయ పడుతుంది. దీని ప్రకారం అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నవారిని చట్ట ప్రకారం శిక్షించాలి.ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఫెడరల్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని, ఈ క్రింది అవసరాలు నెరవేర్చేలా చేయాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.

1.ఈ సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించాలి.
2. యుద్ధ ప్రాతిపాదికన అన్ని ఆసుపత్రులను జాతీయం చేయాలి.
3. కార్పొరేట్ మాఫియాను అరికట్టాలి.
4. ప్రతి మండలానికి 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలి.
5. ప్రభుత్వ ఖర్చులతోనే అంబులెన్సు సర్వీసులను కొనసాగించాలి.
6. పూర్తీ స్థాయిలో వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాలి.
7. కరోనా బాధితులతో పాటుగా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలి.
8. పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి.
9. కోవిద్-19 పరీక్షా కేంద్రాలు మరియు వ్యాక్సిన్ కేంద్రాలు వేర్వేరు చోట్ల నిర్వహించాలి.
10. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలి.
11. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని చట్ట ప్రకారం శిక్షించాలి.
12. కోవిద్-19 రెండవ వేవ్ ని నియంత్రిస్తూ ,దేశాన్ని మూడో వేవ్ లోకి వెళ్లకుండా శాస్త్రీయ నిర్ణయాలు చేయాలి. ప్రజల ప్రాణాలు రక్షించాలి.
13. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కనీసం 10 శాతం వైద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించాలి. కోవిడ్ పా౦డేమిక్ లాంటి విపత్తులకు ప్రత్యేక౦గా అవసరమైన నిధులను తక్షణం విడుదల చేయాలి.

ధన్యవాదాలతో,
ప్రోగ్రెసివ్ డాక్టర్స్ .

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.