రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 40 శాతం మంది నేర చరితులే

Publish Date:Jun 17, 2022

Advertisement

త‌మ‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసుకుని ధ‌న్యులం కావాల‌ని దీక్ష‌బూని మ‌రీ అధికారంలోకి వచ్చా మ‌ని ప్ర‌జాప్ర‌తినిధులు  ఘనంగా చెప్పుకోవడం వింటుంటాం. కానీ చిత్రంగా ఫ‌లానా హ‌త్య‌ వెనుక, లేదా ఫ‌లానా గూండాల దాడి వెనుక ఫ‌లానా ఎమ్మెల్యే, ఫ‌లానా మంత్రి వున్నార‌ని విని తెగ ఆశ్చ‌ర్య‌పోవ‌డ‌మూ చాలా కాలం నుంచి వున్న‌ది. ప్ర‌జ‌ల సేవే ప‌ర‌మ‌ ధ‌ర్మంగా  ప్ర‌చారం చేసి ఎన్నిక‌ల్లో గెలిచిన‌వారిలో చాలా మందికి అస‌లు మాన‌వ‌త్వ‌మే వుండ‌ద‌న్నది తెలియ‌జేసిన సంఘ‌ట‌న‌లూ జ‌రుగుతున్నాయి. దేశ‌ వ్యాప్తంగా చాలామంది నాయ‌కులు, మంత్ర‌లు నేర‌ చ‌రిత్ర క‌లిగిన‌వారే అని మీడియా బ‌య‌ట‌పెట్టింది.  పెద్దల సభకు విద్యావంతులు, సామాజిక సేవా రంగంలో  నిస్వార్థంగా సేవ చేసిన వారిని పార్టీలు ఎంపిక చేసి మరీ పంపుతాయని అనుకుంటాం కానీ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాస్వామ్య విలువలు పట్టవడనానికి ఇటీవల   రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల్లో 40 శాతం ఎంపీలకు నేరచ‌రిత్ర ఉంద‌నీ, ఇందులో 12 శాతం ఎంపీల‌పై సీరియ‌స్ క్రిమినల్ కేసులు ఉన్నాయనీ నేషనల్ ఎలక్షన్ వాచ్,  అసోసియేషన్ ఫర్ ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ (ఏడి ఆర్‌) తెలి పాయి. వీరిలో ఎక్కువ మంచి హత్య, మహిళలపై లైంగిక దాడుల ఆరోప‌ణలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొ న్నాయి. అభ్య‌ర్ధుల నామినేష‌న్ సందర్భంగా దాఖ‌లు చేసిన అఫిడెవిట్లే వారి నేర‌చ‌రిత్ర‌ను వెల్ల‌డిం చ‌డం గ‌మ‌నార్హం.   ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన 57 మంది స‌భ్యుల్లో ఏకంగా 23 మంది (దాదాపు 40 శాతం) పై  క్రిమిన‌ల్ కేసులు వున్న‌ట్లు  ఏడిఆర్ తెలిపింది.

అలాగే 12 మందిపై (21 శాతం) హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం, దొంగత‌నం, మ‌హిళ‌ల‌పై నేరాలు వంటి తీవ్ర‌మైన నేర కేసులున్న‌ట్లు కూడా ఏడిఆర్ వెల్ల‌డించింది. పార్టీల‌వారీగా  ఇచ్చిన నివేద‌క  ప్ర‌కారం బిజెపీ నుంచి ఎన్నికైన  22 మంది  రాజ్య‌స‌భ స‌భ్యుల్లో  9 మందికి, 9 మంది కాంగ్రెస్ ఎంపీల్లో న‌లుగురికి, టిఆర్ ఎస్‌,ఆర్జేడీకి చెందిన  ఇద్ద‌రేసి ఎంపీలు, వైసీపీ,   డీ ఎంకే, ఏఐడిఎంకే, స‌మాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఎస్‌హెచ్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ నుంచి ఒక్కో ఎంపీకి  నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్‌ వివరించింది. 

రాష్ట్రాల ప‌రంగా చూస్తే.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆరుగురు, మహారాష్ట్ర, బీహార్‌ నుంచి నలుగురు, తమిళ నాడు నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానా నుంచి ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లు నివేదిక పేర్కొంది. ఈ నెలలో రాజ్యసభకు ఎన్ని కైన మొత్తం 57 మంది ఎంపీల స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించి నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్,  నేషనల్ ఎలక్షన్ వాచ్ తెలిపాయి. ఈ నివేదిక‌ల్లో పేర్కో న్న 57 మంది ఎంపీలలో 23 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించార‌ని నివేదిక తెలిపింది.

కొత్తగా ఎన్నికైన 57 మంది ఎంపీల చర, స్థిరాస్తులను విశ్లేషిస్తూ.. వారిలో 53 మంది (93 శాతం) మిలియనీర్లని తెలిపింది. మొదటి మూడు సంపన్న అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థ సారధి మొత్తం రు. 1,500  కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారని నివేదిక పేర్కొంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ మాజీ నాయకుడు కపిల్ సిబల్ నిలిచారు. ఆయ‌న మొత్తం ఆస్తు ల విలువ రు.608 కోట్లకు పై మాటే.  ఇక‌.. పంజాబ్ నుండి కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ రు. 498 కోట్ల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు. 2022లో రాజ్యసభకు కొత్తగా ఎన్ని కైన ఎంపీల సగటు ఆస్తుల విలువ  రు. 154.27 కోట్లు అని నివేదిక పేర్కొంది.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.