మధుమేహం ఉన్నవారు పొరపాటున కూడా తినకూడని పండ్లు ఇవే..

Publish Date:Oct 11, 2023

Advertisement

డయాబెటిస్ లేదా మధుమేహం అనేది చాలా పెద్ద సమస్య. దీనికి  శాశ్వత నివారణ లేదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెరను నియంత్రించడం ద్వారా మాత్రమే మెరుగైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  డయాబెటిక్ రోగులు పండ్లు తినాలా వద్దా  అనే ప్రశ్న చాలామందిలో  తలెత్తుతుంది. డయాబెటిక్ పేషెంట్లు తమ పరిస్థితిని మెరుగ్గా ఉంచుకోవడానికి,  రక్తంలో చక్కెర స్థాయిని,   దాని  లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవడానికి  ఆహారంలో పండ్లను ఒక భాగం చేసుకోవాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ సూచిస్తోంది.

పండ్లు,  కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పండ్లు విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్  వంటి అద్భుతమైన మూలాలతో కలిగి ఉంటాయి. కొన్ని పండ్లలో అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లను తినకుండా ఉండటానికి కారణం ఇదే. అయితే మధుమేహం ఉన్నవారికి శత్రువు లాంటి  పండ్లు ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా ఎప్పుడూ తినకూడదు.

పుచ్చకాయ, అరటి పండు..

గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఆహారం తిన్న తర్వాత ఒక వ్యక్తి  రక్తంలో చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో కొలుస్తుంది. ఆహారం  GI స్కోర్ 70 నుండి  100 మధ్య ఉంటే, అది అధిక చక్కెరను కలిగి ఉంటుంది.  పుచ్చకాయ,  అతిగా పండిన అరటిపండ్లు ఈ కోవలో ఉన్నాయి.

యాపిల్..

ఒక వ్యక్తి తినే కార్బోహైడ్రేట్ మొత్తం వారి రక్తంలో చక్కెర స్థాయిలపై  ప్రభావాన్ని చూపుతుంది.. యాపిల్,  అరటి పండ్లలో  పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

మామిడి..

మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు, ఎందుకంటే దాని రుచి అలాంటిది. కానీ డయాబెటిక్ పేషెంట్ దీన్ని తినేముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక మామిడికాయలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది.

పైనాపిల్.. లిచీ..

పైనాపిల్‌లో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. దీని GI విలువ కూడా ఎక్కువే. ఇది కాకుండా లిచీ కూడా అలాంటి కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఈ జ్యుసి  పండులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్నవారు లిచీ,  పైనాపిల్ తినాలని అనిపిస్తే చాలా  పరిమితంగా  తీసుకోవాలి.

మధుమేహం ఉన్నవారు పండ్లరసాలు తాగచ్చా..

భోజనం సమయంలో పండ్ల రసాన్ని తాగడం లేదా  వేరే దేనివల్లనైనా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. పండ్లను ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో పండ్ల రసాలు తాగే వ్యక్తులు మధమేహానికి గురయ్యే అవకాశం ఉంది. జ్యూసులకు బదులుగా  మధుమేహం ఉన్నవారు  ఆప్రికాట్లు, బ్లాక్బెర్రీస్, చెర్రీస్, నారింజ, బొప్పాయి, పీచెస్, రేగు, స్ట్రాబెర్రీ  వంటి పండ్లను పుష్కలంగా నేరుగా తీసుకోవచ్చు.

                                                               *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.