ఆమెకు ౩౦.. అతనికి 19 .. ఏంటో తెలుసుకోండి.. 

Publish Date:May 7, 2021

Advertisement

ఈ మధ్య కాలం లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లిళ్లు జరిగిన, పిల్లలు ఉన్న అటు ఆడ, ఇటు మగ ఇద్దరు రెచ్చిపోతున్నారు. పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేస్తున్నారు. భార్య మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుందని భార్య ఒకరినొకరు క్షణికావేశంలో చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో పసిపిల్లనకు అనాధలుగా చేస్తున్నారు. 

అది తూర్పు గోదావరి జిల్లా. కాజులూరు మండలం. శీల పంచాయతీ. ఆమె పేరు రమణమ్మ. ఆమెకు 30 సంవత్సరాలు, ఆమెకు పెళ్లి అయింది. ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. మొగుడు, పిల్లలు చూసుకుంటూ ఉండాల్సిన ఆమె అక్కడితో ఆగలేదు. 

అతనికి పేరు జె.వెంకటశివరామరాజు. అతనికి 19 ఏళ్లు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి రమణమ్మతో పరిచయం అయింది. ఆ పరిచయాన్ని  పెంచుకున్నాడు. తర్వాత, ప్రేమిస్తున్నానని చెప్పడంతో.. గత రెండేళ్లుగా శీలలంకలోని ఓ రొయ్యల చెరువుల వద్ద పనికి కుదిరి ఇద్దరూ అక్కడే సహజీవనం సాగిస్తున్నారు. రమణమ్మ మూడేళ్ల చిన్న కుమార్తె కూడా వారితోనే ఉంటోంది. 

కట్ చేస్తే.. ఆ రమణమ్మ 19 ఏళ్ళ ఆటో డ్రైవర్ కి పెళ్ళాం అవుదామనుకుంది. తనని పెళ్లి చేసుకోమని లవర్ ని అడిగింది. అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అంతటితో  ఆమె ఊరుకోలేదు అతడిని నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని రమణమ్మ వెంకటశివరామరాజు పై రోజు ఒత్తిడి తీసుకొస్తుండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మూడు రోజుల క్రితం కూడా గొడవ పడి రాత్రికిరాత్రే ముగ్గురూ మాయమైనట్లు రొయ్యల చెరువుల యజమాని ఎం.వేణుగోపాల్‌ శుక్రవారం గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అర్ధరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రమణమ్మను ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చి, తాను పని చేస్తున్న చెరువుల వద్దే పూడ్చిపెట్టడడంతో పాటు ఆమె కూతురును పిఠాపురంలో రోడ్డు పక్కన వదిలి పరారైనట్లు నిర్ధారించారు. కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి.. తహసీల్దారు బి.సాయిసత్యనారాయణ, వైద్యుల సమక్షంలో రమణమ్మ మృతదేహన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సంరక్షణలో ఉందని ఆయన చెప్పారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.