భయమే చంపేసింది.. 

Publish Date:May 18, 2021

Advertisement

అతడు ఒక ఉపాధ్యాయుడు. అతని పేరు లోకేష్. అతనికి సంవత్సరం కింద పెళ్లి అయింది. ఆ ఉపాద్యాయుడు మొదటి నుండే భయస్తుడు. అతనికి ఈ మధ్య కాలం లో అతనికి కరోనా వచ్చింది. ఇక అంతే   అతడు సినిమాలోని ఓ సీన్ రిపీట్ అయింది. అతడు సినిమాలో త్రివిక్రమ్ ఇచ్చిన డెఫినేషన్ గుర్తుండే ఉంటుంది. ‘దెయ్యం కంటే భయం మా చెడ్డది’. ఇది అక్షర సత్యం.  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ నృత్యం చేస్తున్న ఈ తరుణంలో కరోనా భయం చాలా మందిని  బలితీసుకుంటోంది. కరోనా సోకితే ఖతమే అన్న భ్రమలో, ప్రజలు  ఆందోళనల చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా కొందరు భయాందోళనలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సింది పోయి.. భయానికి తమ జీవితాలను అప్పగిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. అదేంటో మీరే చూడండి. 

అది కర్ణాటకలోని మైసూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. మైసూరు జిల్లాలోని కేఆర్‌నగర్ పరిధిలో ఉన్న కోగిలూరు గ్రామానికి చెందిన లోకేశ్(26) ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. లోకేశ్‌కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహమైంది. లోకేశ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ మొదటి నుంచి కొంత భయస్తుడు. ఈ మధ్య లోకేశ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ తనకు భయంగా ఉందని కుటుంబ సభ్యుల వద్ద వాపోయాడు. ఏం పర్లేదని, చాలామంది కరోనా నుంచి కోలుకున్నారని.. కంగారు పడొద్దని కుటుంబ సభ్యులు లోకేశ్‌కు ధైర్యం చెప్పారు. వైద్యశాఖ అధికారులు కూడా భయపడవద్దని, సక్రమంగా మందులు తీసుకుంటూ.. పౌష్టికాహారం తింటే కరోనాను జయించవచ్చని లోకేశ్‌కు చెప్పారు. ఇలా ఎంతమంది చెప్పినా లోకేష్‌ను కరోనా భయం వదల్లేదు. మాములుగానే కొంత భయస్తుడు కావడంతో కరోనా మహమ్మారి అతనిని మరింత భయపెట్టింది. మూడు రోజులుగా కరోనా సోకిందన్న భయంతో తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ కోగిలూరు నుంచి అత్తారింట్లో ఉన్న భార్య దగ్గరకు వెళతానని ఇంటి దగ్గర చెప్పాడు. వైరస్ సోకిందని.. ఇప్పుడు వెళ్లవద్దని ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. బైక్‌పై అత్తారింటికి వెళ్లాడు.

ఇంటి ముందు బైక్ ఆపి.. ఇంట్లో ఎవరినీ కలవకుండా తన దగ్గర ఉన్న ఫోన్‌ను ఇంట్లో పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన లోకేశ్ ఎంతకూ తిరిగిరాకపోవడంతో భార్య, అత్తమామలు అతని కోసం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో లోకేశ్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు హాసన్ జిల్లాలోని కేరళపుర దగ్గర ఉన్న కావేరినది దగ్గర లోకేశ్ మృతదేహాన్ని గుర్తించారు. కరోనా సోకిందన్న మనోవేదనతో కావేరి నదిలో దూకి లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చారు. ఇలా ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న లోకేశ్ జీవితం కరోనా భయం వల్ల అర్ధాంతరంగా ముగిసిపోయింది. కరోనా సోకినప్పటికీ భయపడవద్దని, ఆత్మ స్థైర్యంతో మహమ్మారిని జయించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.