Publish Date:Jun 19, 2025
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారిలో డీఎన్ఏ పరీక్షల ద్వారా 202 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకూ 157 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే లండన్ వెళుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో బీజే మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా మరణించారు. మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ పరీక్షలు ఎప్పటికి పూర్తవుతాయా అన్న సందేహం మొదట్లో వ్యక్తమైంది. అయితే యుద్ధ ప్రతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా వరకూ పూర్తి చేశారు.
మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వంటి ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో ఆయన కుమారుడు రుషభ్ రూపానీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ, వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/202-bodies-identified-through-dna-tests-39-200317.html
దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది.
క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు.
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాదీయులు మృతి చెందారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా?
మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్ హై స్కూల్‌ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.