ఏపీలో 2019 నాటి సీన్ రిపీట్.. కేసీఆర్,ఉండవల్లి భేటీ రహస్యం ఇదేనా?

Publish Date:Jun 13, 2022

Advertisement

ఉండవల్లి అరుణ్ కుమార్.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఉండుండి ఒక్కసారి తన విలక్షణ, సంచలన విశ్లేషణలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీలో ఒక్క సారిగా తెరమీదకు వచ్చారు. కేసీఆర్ ఎందుకు పిలిచారు? ఉండవల్లి ఎందుకు వెళ్లారు? అన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్ లో జరుగుతోంది.

ఎందుకంటే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో మొదటి వరుసలో ఉన్న ఉండవల్లి.. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తరువాత నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ తో భేటీ కావడమే ఒక సంచలనం అయితే.. విభజనను పూర్తిగా వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ పిలిపించుకుని మరీ చర్చించడం అంతకు మించిన సంచలనం. సరే ఇరువురి భేటీ అయిపోయింది. ఆ భేటీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా ఉన్నారు. అనూహ్య నిర్ణయాలు, వ్యూహాలకు పెట్టింది పేరైనా పీకే సమక్షంలో భిన్న ధృవాలు వంటి కేసీఆర్, ఉండవల్లిల భేటీ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ప్రస్తుతం ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీపై పలు విశ్లేషణలు వస్తున్నాయి.  ప్రస్తతుం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు రెండూ కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయన్న అంచనాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ, ఏపీలో అధికారం చేపట్టాలని భావిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లు కీలకం అని భావిస్తున్నారు. అలాగే ఏపీలో అధికారం కోసం అర్రులు చాస్తున్న పవన్ కల్యాణ్ కు గత ఎన్నికలలో పొరుగు రాష్ట్రం నుంచి వైసీపీ అధినేత జగన్ కు ఎలాంటి ‘సహకారం’ అందిందో అటువంటి సహకారం కోరుకుంటున్నారు. సో రోగీ వైద్యుడు సామెతలా ఇరువురి ఉద్దేశాలూ ఒకటే అయినా ఇరువురికీ సమన్వయం కుదిర్చే ఒక మీడియేటర్ అవసరం. సరిగ్గా ఆ మీడియేటర్ పాత్ర పోషించేందుకు ఉండవల్లి అయితే సరిగ్గా సరిపోతారని కేసీఆర్ భావించారు. అందుకే ప్రత్యేకంగా ఆయనను హైదరాబాద్ పిలిపించుకుని చర్చించారు.

ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు కూడా ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ (పీకే) సమక్షంలో ఈ భేటీ జరిగింది. అంటే ఉండవల్లిని పరోక్షంగనో, ప్రత్యక్షంగానో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులను తెరాస వైపు ఆకర్షితులను చేయడానికి అదే సమయంలో ఏపీలో జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి.. తన రాజకీయ గురువు వైఎస్ కుమారుడు జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగపడేలా మౌల్డ్ చేయడానికే ఈ భేటీ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అయితే అప్పట్లో ఉండవల్లి ప్రత్యక్షంగా ఇలా బయట పడలేదు కానీ, పవన్ కల్యాణ్ తో భేటీల్లో కానీ, ఆయన  అప్పట్లో ఏర్పాటు చేసిన పలు మీడియా సమావేశాలలో కానీ తెలుగుదేశం, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు అనర్ధమన్న రీతిలోనే సాగాయి.

సరే కారణాలేమైతేనేం నాడు తెలుగుదేశం, జనసేన పార్టీలు విడివిడిగా రంగంలోకి దిగాయి. ఫలితం తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్న వేళ మరో సారి ఉండవల్లిని రంగంలోకి దింపడం ద్వారా ‘కాగల’ కార్యాన్ని సాధించాలని కేసీఆర్, పీకేల వ్యూహంలో భాగమే ఉండవల్లితో   భేటీ అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో కేవలం 7 శాతం ఓటు షేర్ ఉన్న పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు తెలుగుదేశం  అంగీకరించే పరిస్థితి ఎటూ లేదు. ఇక ఏపీలో జనం మూడ్ వైసీసీకి వ్యతిరేకంగా ఉందన్నదీ ఇటీవలి పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఓట్ల చీలిక ఒక్కటే రాష్ట్రంలో వైసీపీని గట్టెక్కిస్తుందన్నది కేసీఆర్, పీకేల వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం ను అధికారానికి దూరం చేయడం ద్వారా కేసీఆర్ కు వచ్చే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమౌతుంది. అయితే తెలంగాణ అభివృద్ధిని ఘనంగా చాటుకోవాలంటే ఏపీలో వెనుకబాటు కొనసాగాలి. గత మూడేళ్లుగా ఏపీ విధానాల కారణంగా తెలంగాణ పాలన ఘనంగా, గొప్పగా ఉందని తెరాస సర్కార్ ప్రచారం చేసుకోగలిగింది.

అంతకు ముందు అంటే 2014 నుంచి 2018 వరకూ తెలంగాణకు ఆ అవకాశం లేకపోయింది. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ కంటే జీరోతో మొదలైన ఏపీ ప్రగతి గురించే నాడు దేశం మొత్తం మాట్లాడుకుంది. అందుకే ఏపీలో తెలుగుదేశం ను అధికారానికి దూరం చేయాలంటే పవన్ కల్యాణ్ ను ఎన్నికలలో ఒంటరిగా పోటీలో దిగేలా ప్రోత్సహించాలి.  అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ని కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ గంటల తరబడి చర్చించారు. సొంత కేబినెట్ మంత్రులకే తెరుచుకోని ప్రగతి భవన్ తలుపులు.. సమైక్యాంధ్ర వాది ఉండవల్లికి బార్లా తెరుచుకోవడం వెనుక కారణం ఇదే. ఏపీలో 2019 నాటి సీన్ రిపీట్ కావాలన్నదే కేసీఆర్, పీకే వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.