జగన్ రెడ్డి ఐదేళ్ల రివర్స్ పాలన.. వైసీపీకి 2019 ఫలితాలు రివర్స్!

Publish Date:Apr 10, 2024

Advertisement

ఐదేళ్ల జగన్ రెడ్డి రివర్స్ పాలనక సరైన ఫలితం దక్కనుంది. ఆ పార్టీకి గత ఎన్నికలలో వచ్చిన ఫలితాలు ఈ సారి ఎన్నికలలో రివర్స్ కానున్నాయి. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ వెలువరించిన సర్వే ఇదే చెప్పింది.  2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆ పార్టీ 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించింది. ఆ సందర్భంగా జగన్ ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు.  సరే ఐదేళ్లు గిర్రున తిరిగిన తరువాత దేవుడు నాలుక కరుచుకుని తన స్క్రిప్ట్ ను కరెక్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోరాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలు ఈ సారి రివర్స్ కానున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు అన్ని అ సర్వేలూ తెలుగుదేశం కూటమికి భారీ విజయం ఖాయమనే పేర్కొన్నాయి. ప్రతిస్ఠాత్మక సంస్థలు వెలువరించిన సర్వేలలోనూ ఇదే ఫలితం వచ్చింది. ఇండియా టుడే వంటి సంస్థలైతే  రెండు మూడు నెలల కిందట వెలువరించిన సర్వేలో వైసీపీ రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో 24 స్థానాలను కైవశం చేసుకుంటుందని పేర్కొంది. అప్పట్లోనే ఆ సర్వే ఫ్యాబ్రికేటెడ్ అని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రెండు మూడు నెలల వ్యవధిలోనే ఇండియా టుడే ప్లేట్ ఫిరాయించేసింది.

తాజాగా వెలువరించిన సర్వేలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి 17 స్థానాలలో విజయం సాధిస్తుందనీ, అధికార వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుందని పేర్కొంది. సరే ఎంతగా సమర్ధిద్దామని ప్రయత్నించినా వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో తన క్రెడిబులిటీని దెబ్బతీసుకోవడానికి ధైర్యం చేయలేక ఇండియా టుడే వాస్తవాలకు దగ్గరగా తన సర్వే ఫలితాన్ని తాజా పరిస్థితి ఇదంటూ సవరించుకుందని చెప్పుకోవచ్చు.

 అది పక్కన పెడితే ఏపీలో రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికే  జనం పట్టం కట్టడానికి ఫిక్స్ అయిపోయారని ఇప్పటి వరకూ వెలువడిన అన్ని సర్వేలూ తేల్చి చేప్పేశాయి.  తాజాగా మరో ప్రముఖ సంస్థ వెలువరించిన సర్వేలో  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి 19 నుంచి 23 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది. ప్రముఖ సర్వే సంస్థ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వెల్లడించింది. నిజానికి అనేక జాతీయ సర్వే సంస్థలు, జాతీయ మీడి యా సంస్థలు ఎన్డీఏ కూటమి 18 సీట్లు సాధించటం పక్కా అని గత నెలలోనే ప్రకటించాయి. ఇప్పుడు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్  తన తాజా సర్వేలో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో  23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని  వెల్లడించింది. ఈ సంఖ్య సరిగ్గా గత ఎన్నికలలో వైసీపీ సాధించిన లోక్ సభ స్థానాల సంఖ్య. అందుకే పరిశీలకులు వైసీపీకి ఈ సారి సీన్ రివర్స్ అవుతోందని విశ్లేషిస్తున్నాయి. రాజకీయవర్గాలలో అయితే ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటూ సెటైర్లు  పేలుతున్నాయి.  

వచ్చే ఎన్నికలలో వైసీపీ 2 నుంచి 3 లోక్ సభ స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే పేర్కొంది. యాక్చువల్గా ఆ సర్వే తెలుగుదేశం కూటమికి 19 నుంచి 23, వైసీపీ కూటమికి 2 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.  దీనిని బట్టి  అసెంబ్లీ ఎన్నికలలో కూడా దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అంటే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమికి 133 నుంచి 151 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించే అవకాశాలుండగా,  వైసీపీ 14 నుంచి  42 స్థానాలు లభించే అవకాశం ఉంది.   అసెంబ్లీ స్థానాల్లో  కూటమి విజయవిహారం చేస్తుందని జాతీయ సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. కొన్ని సంస్థలు ఎన్డీఏకూటమి 135 సీట్లు సాధిస్తుందని వెల్లడించగా, మరికొన్ని 150 సీట్ల వరకూ సాధిస్తుందని పేర్కొన్నాయి. కూటమి ఏర్పడక ముందు..  తెలుగుదేశం ఒంటరిగా 100 సీట్లు సాధిస్తుందని పలు సర్వేలు ప్రకటించిన సంగతి తెలిసిందే.  

తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేఅదే విషయం తెలిపింది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ  ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  వెలువరించిన ఫలితాలు దాదాపుగా నిజమయ్యాయి.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 59-67, బీఆర్‌ఎస్ 36-44, బీజేపీ 7-9, ఇతరులు 6-8 సీట్లు సాధిస్తాయని వెల్లడించగా, ఎన్నికల ఫలితాలు దాదాపు అలాగే వచ్చాయి. దీంతో  ఇప్పుడు ఏపీలో  ఈ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు నిజమవడం ఖాయమని  విశ్లేషకులు నమ్ముతున్నారు.  వైసీపీకి 2019లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు రివర్స్ అవుతాయనీ, జగన్ రెడ్డి రివర్స్ పాలనకు అదే సరైన  రివర్స్ ఫలితంగా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.