ఆసీస్- భారత్ తొలి టెస్టు తొలి రోజు వికెట్లు టపటపా

Publish Date:Nov 22, 2024

Advertisement

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య  ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో  తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్ 22) పెర్త్‌వేదికగా మొదలైంది. తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత బ్యాటర్ల తడబ్యాటు ఆశ్చర్యం కలిగించకపోయినా, టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు కూడా చేతులెత్తేయడమే విశేషం.  

తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా ఆసీస్ పేసర్ల ధాటికి చేతులెత్తేసింది.  ఆసిస్ బౌలర్లలో  జోష్ హేజిల్‌వుడ్ గరిష్టంగా నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.  ఈ టెస్టుతో టీమ్ ఇండియా తరఫున  అరంగేట్రం చేసిన   నితీష్ కుమార్ రెడ్డి  41 పరుగులే అత్యధిక పరుగులు కావడం విశేషం.  టీమ్ ఇండియా ఓపెనర్ యశశ్వి జైశ్వాల్, దేవదత్  పడిక్కల్  ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు.  అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓపికగా ఆడి 74 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు.   ధ్రువ్ జురెల్ 11 , వాషింగ్టన్ సుందర్ నాలుగు, అవుటయ్యారు.  పంత్ 37 కూడా మంచి ఆరంభాలను మంచి స్కోర్లుగా మాలచడంలో విఫలమయ్యారు.  

ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ బ్యాటర్లు టీమ్ ఇండియా పేసర్లు బుమ్రా, సిరాజ్ ల ధాటికి పెవిలియన్ కు క్యూకట్టారు. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు.  తొలి రోజు ఆటముగిసే సరికి  అలెక్స్ కేరీ 19 పరుగులతోనూ, మైకేల్ స్టార్క్ 6 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. మొత్తం మీద తొలి రోజు 17 వికెట్లు పతనమయ్యాయి. పేసర్లకు అనుకూలించిన పెర్త్ పిచ్ పై తొలి రోజు ఆటలో నిస్సందేహంగా టీమ్ ఇండియా పై చేయి సాధించింది. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.