క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును 15ఏళ్లకుర్రోడు బ్రేక్ చేసేశాడు!

Publish Date:Jun 6, 2026

Advertisement

క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును 15ఏళ్ల యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేయనున్నారు.  ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం(జూన్ 6)  ముంబైలో సమావేశమై   టీ20 జట్టును  ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఈ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయ పరిచాయి.  

వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించే వ్యూహంతో సెలక్టర్లు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేయడమే కాకుండా, ఆయనను జట్టు నుంచే  తప్పించారు. అలాగే.. ఐపీఎల్ 2026 సీజన్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. ఇక తెలుగుతేజం, యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

వీటన్నిటినీ మించి  కేవలం 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి  టీ20  స్క్వాడ్ లో చోటు దక్కింది.  ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ బీహార్ కుర్రాడు  పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఈ సీజన్ లో ఏకంగా 772 పరుగులు చేసి ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సాధించడమే కాకుండా, తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో ఏకంగా 62 సిక్సర్లు బాది అందరినీ ఆకట్టుకున్నాడు.  ఈ అసాధారణమైన ఘనతతో కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అత్యంత పిన్న వయసులో టీమిండియాకు ఎంపికైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  

ఈసారి టీమిండియా ఎంపికలో పూర్తిగా ఐపీఎల్ 2026 ప్రదర్శనే అత్యంత కీలకంగా మారింది. ఐపీఎల్ లో నిలకడగా రాణించిన ఎందరో యువ ఆటగాళ్లకు ఈ పర్యటనల్లో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. బౌలింగ్ విభాగంలోనూ సెలక్టర్లు సరికొత్త ప్రయోగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ఆడి, 16 వికెట్లతో మెరిసిన అద్భుత పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు తొలిసారి భారత జట్టులో స్థానం కల్పించారు. వీరితో పాటు సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తదితరులు ఈ మూడు కీలక పర్యటనల టీ20 స్క్వాడ్స్‌లో తమ చోటును దక్కించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్ ను పక్కన పెట్టి, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో, వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్ సెన్సేషన్ తో రంగంలోకి దిగుతున్న ఈ సరికొత్త యంగ్ టీమిండియా భవిష్యత్తులో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By
en-us Political News

  
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.