Publish Date:Oct 27, 2024
హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. నెల రోజుల వరకూ నగరంలో 144వ సెక్షన్ కింద ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆంక్షల మేరకు నగరంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఉండదు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈ ఆంక్షలు ఆదివారం (అక్టోబర్ 27) నుంచి అమలులోకి వచ్చాయి. వచ్చే నెల 28 వరకూ అమలులో ఉంటాయి. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వ్యులు జారీ చేశారు. 144 సెక్షన్ ప్రకారం ఒకే చోట ఐదుగురు అంతకు మించి జనం గుమికూడకూడదు.
అయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతి యుతంగా నిరసనలు, ధర్నాలకు ఎటువంటి ఆంక్షలూ లేవని పేర్కొన్నారు. ధర్నా చౌక్ వద్ద ధర్నాలు, నిరసనలు శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ధర్నా చౌక్ వినా నగరంలో మరెక్కడా ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/144-section-in-hyderabad-25-187501.html
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.