అంబటికి 14 రోజుల రిమాండ్.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు
Publish Date:Feb 1, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీసులు శనివారం (జనవరి 31) రాత్రి అదుపులోనికి తీసుకున్న సంగతి విదితమే. గోరంట్ల వద్ద తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై ‘మహాపాపం’ పేర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద టీడీపీ శ్రేణులు అంబటిని అడ్డుకున్నాయి. ఆ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్య వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై అంబటిపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లపాడు పీఎస్ లో తెలుగుదేశం గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంబటిని శనివారం (జనవరి 31) అర్ధరాత్రి అరెస్టు చేసి నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆదివారం (ఫిబ్రవరి 1) రాత్రి ఆయనను మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి అంబటికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి తరలించారు.
http://www.teluguone.com/news/content/14-days-remand-to-ambati-25-213360.html





