Publish Date:Jun 23, 2025
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కన్పప్ప సినిమాకు సినిమా కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కన్నప్పలో కీలక సన్నివేశాల హార్డ్ డిస్క్ చోరీకి గురైంది. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ విషయంలోనూ ఇబ్బందుకు ఎదురౌతున్నాయి. కన్నప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ 13 సన్నివేశాలను తొలగించాల్సిందేనంటూ రివిజన్ కమిటీ నివేదిక ఇచ్చింది. సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కించపరచడం, పిలక, గిలక పాత్రలతో ఒక సామాజిక వర్గాన్ని, దేవీ, దేవతలను, కోయకులాన్ని కించపరిచే విధంగా ఉన్న 12 సన్నివేశాలను తొలగించాల్సిందేనని 11 మంది సభ్యులతో కూ డిన రివిజన్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మేరకు ఆ 13 సన్నివేశాలను తొలగించిన సినిమా కాపీ వచ్చిన తరువాతే కన్నప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని రీజనల్ సెన్సార్ ఆఫీసర్ పేర్కొన్నారు.
కన్నప్ప సినిమా పై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డ్ , సినీమా నిర్మాత మంచు మోహన్ బాబు నటులు మంచు విష్ణు బ్రహ్మానందం, సప్తగిరి వాదనలు వినిపించాల్సి ఉంది. కన్నప్ప సినిమా విషయంలో తొలి నుంచీ సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయానికించపరచడం దేవీ దేవతలను కించపరచడం సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/13-scenes-in-kannappa-movie-should-cut-25-200496.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.