పినరయి క్యాబినెట్ లో కుబేరులు
Publish Date:May 26, 2021
Advertisement
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రి వర్గంలో ఉన్న 20 మంది మత్రులలో, ఓ 13 మంది మాత్రమే కోట్లకు పడగలెత్తిన కామ్రేడ్లు. మిగిలిన ఏడుగురు మరీ అంతకాదు కానీ, ఓ మోస్తరు బూర్జువాలు. సగటున ఒక్కొక్కమంత్రి ఆస్తుల విలువ, ఓ రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే, ఆ 20 మంది మంత్రులలో 12 మంది మీదనే, క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఓ ఐదుగురిపై, చాల సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. సీరస్ కేసులంటే తెలుసుకదా, మర్డర్లు, మానభంగాలు కావచ్చు, కాదంటే దొమ్మీలు దోపీడీలు వంటి ఇతర కేసులు కావచ్చును. మిగిలిన ఎనిమిది మంది మీద ఇతరత్రా చిల్లర కేసులే కాని, క్రిమినల్ కేసులు లేవు.నిజం. ఇవ్వన్నీ, ఎవరో ఎర్ర జెండా పొడ గిట్టని వాళ్ళు లేదా బూర్జువ మీడియా బయట పెట్టిన రహస్యాలు కాదు, స్వయంగా సదరు మంత్రులు, తమ నామినేషన్ పత్రాలతో పాటుగా స్వహస్తాలతో సంతకం చేసి సమర్పించిన అఫిడవిట్స్’ సాక్షిగా సత్యాలు. అయితే వీటిని బయట పెట్టింది మాత్రం, ఎన్నికల నిఖా సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్). కేరళ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్’తో కలిపి మొత్తం 21 మంది మంత్రులున్నారు. అందులో విజయన్ సహా 20 అఫిడవిట్లను విశ్లేషించి, ఏడీఆర్ ఈ వివరాలను నివేదిక రూపంలో ప్రచురించింది. ఇందులో తెలిపిన వివరాల ప్రకారం, సిపిఎంకు చెందిన మంత్రి వి. శివకుట్టి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉండడంతో, ఆయన ఆస్తుల విశ్లేషణ చేయలేదని , ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అఫిడవిట్ అసంపూర్తిగా ఉంటే, అయన నామినేషన్ ఎలా ఓకే చేశారు? అంటే అది... ఎలక్షన్ సంఘం వెబ్సైటులో స్పష్టంగా లేదు కానీ, సంఘాని సమర్పించిన పత్రాలలో అన్నీ సక్రమంమగానే ఉన్నాయని అనుకోవచ్చును. ఇక కోట్లకు పడగలెత్తిన మంత్రులలో, కుబేర కామ్రేడ్ అనదగిన అందరి కంటే అధిక ధనవంతుడు వి.అబ్డురహిమన్. ఈయన తనూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్నికయయ్యారు. ఆయన ప్రకటిత ఆస్తుల విలువ అక్షరాల రూ. 17 కోట్ల 17 లక్షలు. ఇక మంత్రులు అందరిలోకి పేద మంత్రి కామ్రేడ్ పి. ప్రసాద్. చేర్తల నియోజక వర్గం నుంచి ఎన్నికైనా ఈయన ప్రకటిత ఆస్తుల విలువ రూ 14.18 లక్షలు. బహుశా పెదలో కోటాలో ఈయనకు మంత్రి పదవి ఇచ్చాఋ కావచ్చును. పాత మంత్రులు అందరినీ పక్కకు నెట్టి ముఖ్యమంత్రి విజయన్ ఎంపిక చేసుకున్న ఎర్ర ముత్యాల విద్యా ప్రమాణాలు కూడా చాలా చాలా ఉన్నతంగా ఉన్నాయి. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన కేరళ మంత్రి వర్గంలో ఎనిమిది మంది ఎనిమిది నుంచి 12 తరగతి వరకు చదువుకున్నవారైతే, మిగిలిన 12 మంది డిగ్రీ ఆపై చదువులు చదివినవారున్నారు. వయసు పరంగా చూస్తే, 13 మంది వయసు 41-60 సంవత్సరాలు, మిగిలిన ఏడుగురు 61-80ఎ ఏళ్ల మధ్య వయసు కుర్రాళ్ళు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా , ఆస్తుల విషయంలో కామ్రేడ్’లు ఎవరికీ తీసిపోరు, అని కామ్రేడ్ విజయన్ ఎంచక్కా నిరూపించారు
http://www.teluguone.com/news/content/13-ministers-in-kerala-cabinet-rich-39-116301.html





