బొత్స అలక తీరింది. దీంతో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో, వారి తల్లిదండుల్లో టెన్షన్ పోయింది. ఎట్టకేలకు టెన్త్ పరీక్షలు వెలువడ్డాయి. విద్యాశాఖ మంత్రి హోదాలో బొత్స సత్యన్నారాయణ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 797 పాఠశాలలు సెంట్ పర్సంట్ రిజల్ట్స్ సాధించాయి.
ఫలితాలలో బాలురుతో పోలిస్తే బాలికలే పై చేయి సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 70.70కాగా బాలురలో అది 64.02శాతంగా ఉంది.78.3శాతం ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 49.7శాతం ఉత్తీర్ణతతో అనంతపురంజిల్లా చివరి స్థానంలో నిలిచింది.
71 పాఠశాలలు జీరో ఉత్తీర్ణత సాధించాయి. టెన్త్ పరీక్షలకు మొత్తం ఆరు లక్షల 2 వేల 537 మంది హాజరు కాగా 4లక్షల14వేల 281మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే మొత్తంఉత్తీర్ణత 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను www.results.bse.ap.gov.inలో చూడవచ్చు.
గత ఏడాదిలొ పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత తగ్గడానికి కరోనానే కారణమని మంత్రి బొత్స అన్నారు. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగలేదన్నారు. అందుకే ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సప్లిమెంటరీ పరీక్ష నెల రోజుల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేపర్ జిరాక్స్ కాపీని రీ వెరిఫికేషన్‌కు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే నెల 5నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆయన ఈ నెల 13 నుంచి ఫెయిల్ అయిన విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/10th-exam-results-released-25-137125.html
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.