ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన టెన్త్ బాలిక
Publish Date:Jun 24, 2025

Advertisement
హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలసి టెన్త్ క్లాస్ చదువుతున్న భాలిక కన్నతల్లినే కడతేర్చింది. తెలంగాణ ఉద్యమకారిణి , తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ మునిమనవరాలైన అంజలిని ఆమె 16ఏళ్ల కూతురు తేజశ్రీ దారుణంగా హతమార్చింది. టెన్త్ క్లాస్ చదువుతున్న తేజశ్రీ 19 ఏళ్ల శివ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఐదు రోజుల కిందట ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
కాగా ఈ విషయంపై అంజలి పోలీసు స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల కిందట తేజశ్రీ తిరిగి ఇంటికి వచ్చింది. అలా వచ్చిన కుమార్తెను అంజలి మందలించింది. ఈ వయస్సులో ప్రేమ వ్యవహారాలు కరెక్ట్ కాదు,
బుద్ధిగా చదువుకోమని హితవు చెప్పింది. అయితే తన ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన తేజశ్రీ ప్రియుడు శివతో కలిసి తల్లిని హత్య చేయడానికి స్కెచ్ వేసింది. ఇందుకు శివ తమ్ముడు యశ్వంత్ కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్ 22) శివ, యశ్వంత్ లు తేజశ్రీ ఇంటికి వచ్చారు. ఆ తరువాత ముగ్గురూ కలిసి అంజలిపై దాడి చేసి చున్నీతో గొంతు బిగించి తలపై రాడ్ తో కొట్టి హతమార్చారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/10th-class-student-tejasri-killed-her-mother-39-200559.html












