వెయ్యి కోట్లకుపైగా వ్యూస్.. యూట్యూబ్‌లో సంచలనం.. సరికొత్త రికార్డు
Publish Date:Jan 15, 2022
Advertisement
యూట్యూబ్ చానెల్స్ కోకొల్లలు. రోజూ లక్షల సంఖ్యలో కొత్త చానెల్స్ పుట్టుకొస్తుంటాయి. కోట్లాది వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. అందులో పాపులర్ చానెల్స్.. వైరల్ వీడియోస్ చాలానే ఉంటాయి. కొన్ని చానెల్స్ తమ వీడియోస్ వందల వ్యూస్ రాబట్టేందుకే చాలా కష్టపడుతుంటాయి. ఇక మరికొన్నేమో ఇలా అప్లోడ్ చేయగానే గంటల గ్యాప్‌లోనే మిలియన్ మార్క్ వ్యూస్ రాబట్టేస్తుంటాయి. మూవీ ట్రైలర్స్, క్లిప్స్, సాంగ్స్.. అలాంటి వైరల్ వీడియోస్‌లో ఎక్కువగా ఉంటాయి. కానీ..... లేటెస్ట్గా.. వందో వెయ్యో కాదు.. మిలియనో.. కోటినో కాదు.. ఏకంగా వెయ్యి కోట్లకుపైగా వ్యూస్ రాబట్టింది ఓ వీడియో. యూట్యూబ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే, ఆ సెన్షేషనల్ వీడియో ఏ మూవీ సాంగో.. పాప్ సాంగో.. కాదు.. పిల్లలు చూసే కిడ్స్ వీడియో. ‘పింక్‌ఫాంగ్’ యూట్యూబ్ ఛానల్‌కు చెందిన ‘బేబీ షార్క్ డ్యాన్స్’ వీడియో వ్యూస్ వెయ్యి కోట్లు దాటేశాయి. యూట్యూబ్‌లో ఈ రికార్డు సాధించిన ఫస్ట్ వీడియో ఇదే. 2016 జూన్‌లో దీన్ని అప్లోడ్ చేశారు. 'బేబీ షార్క్ డ్యాన్స్' వీడియోలో.. ఇద్దరు చిన్నారులు బేబీ షార్క్ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో యానిమేటెడ్ షార్క్ చేపలతో ఈ వీడియో చేశారు. తమ ‘బేబీ షార్క్ డ్యాన్స్’ వీడియో వెయ్యి కోట్ల వ్యూస్ రికార్డు సాధించడంపై పింక్‌ఫాంగ్ సీఈవో మిన్ సియోక్ కిమ్ ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వ్యూస్ వస్తే ఆమాత్రం ఆనందం ఉండకుండా ఉంటుందా. ఇక యూట్యూబ్‌లో 700 కోట్లకుపైగా వ్యూస్‌తో ప్యూర్టోరికన్ పాప్ స్టార్ లూయిస్ ఫోన్సీ సాంగ్ ‘డెస్పాసిటో’ సెకండ్ ప్లేస్‌లో ఉంది.
http://www.teluguone.com/news/content/1000-crore-views-record-for-baby-shark-dance-video-25-130217.html





