అక్కను చంపి ముక్కలుగా నరికిన తమ్ముడు

Publish Date:Mar 18, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న ఓ తమ్ముడికి అక్కంటే చాలా ఇష్టం... అక్క, బావ కలిసి మెలిసి ఉండడం చూసి సంతోష పడేవాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం బావ చనిపోయాడు. దీంతో అక్కలో మార్పు వచ్చింది. అది గమనించిన తమ్ముడు అక్కను పలుమార్లు మందలించాడు. అందుకు అక్క నిరాకరించింది. దీంతో తమ్ముడు అక్కను వదిలేసాడు..కొద్దిరోజుల తర్వాత అక్క కనిపించకుండా పోయింది. తన అక్క మరో వ్యక్తితో వెళ్లిపోయింది.. కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు... ఇక్కడి వరకు కథ బాగా నచ్చింది. అయితే పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయడంతో విస్సుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తమ్ముణ్ణి అదుపు లోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్య చకితులయ్యారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేదించారు... వివరాల్లోకి వెళితే...అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారంలో నీలా(40), తన తమ్ముడు పప్పుతో కలిసి నివాసం ఉంటుంది.. నీలా భర్త కొన్నాళ్ల క్రితమే చనిపో యాడు.. దీంతో నీలా ప్రవర్తనలో మార్పు వచ్చింది. బావ చనిపోయిన తర్వాత అక్క నీలా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేది. అది గమనించిన తమ్ముడు పప్పు పలుమార్లు అక్కను మందలించాడు. 

అయినా కూడా అక్క నీలాలో మార్పు రాలేదు సరి కదా ఇంకా ఎక్కువగా చెడు తిరుగుళ్ళు తిరిగేది... దీంతో విసుకు చెందిన పప్పు ఎలాగైనా సరే అక్కను అంతం చేయాలనుకున్నాడు. దీంతో పప్పు గత నెల ఫిబ్రవరి 28వ తేదీన అక్క నీలాను చంపేశాడు. అనంతరం బాత్రూంలో అక్క మృత దేహాన్ని ముక్కలు ముక్క లుగా నరికి గోనె సంచిలో నింపి కారులో తీసుకెళ్లి మజీద్ పుర చెరువులో కొన్ని బాడీ పార్ట్స్ పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను చెరువు పక్కన ఉన్న చిట్టడవిలో పడేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన అక్క లీల కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు... అంతేకాకుండా పోలీసుల దగ్గర అక్క మీద ప్రేమ ఉన్నట్లుగా తెగ నటించాడు. 

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగించారు. అయితే పప్పు ఈనెల రెండవ తేదీన అక్క సెల్ ఫోన్ నుండి తనకు తాను మెసేజ్ పెట్టుకున్నాడు.. తన అక్క ఎవరితోనో వెళ్ళిపోయింది అంటూ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులకు పప్పు ప్రవర్తనపై అనుమానం వచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలోనే తమ్ముడు పప్పు కాల్ డేటా బయటికి తీసిన పోలీసులు అది చేసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యారు. అనంతరం పోలీసులు పప్పును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.మజీద్‌పురా చెరువు పక్కన ఉన్న చిట్టడవిలో గుర్తించిన శరీర భాగాలతో కేసు ఛేదించారు. దీంతో పోలీసులు పప్పును అరెస్టు చేశారు.

By
en-us Political News

  
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.