జీవన్‌‌రెడ్డిని ఫాంహౌస్ నుంచి గెంటేసిన కేసీఆర్... అందుకేనా?

Publish Date:Jul 16, 2025

Advertisement

గెటవుట్  ఫ్రమ్ మై ఫామ్‌హౌస్.. నా బిడ్డ ఓటమికి కారణం నువ్వే అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై గులాబీబాస్ ఫైర్ అయ్యారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే జీవన్‌రెడ్డి ఫామ్ హౌస్ కి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారట. కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు ఎమ్మెల్యేలు సహకరించలేదని బహిరంగంగా చెప్పిన మాట ఇప్పుడు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. కవితకు సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్‌కి నమ్మిన బంటుగా వ్యవహరించిన జీవన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కవిత ఆధిపత్యాన్ని ఒప్పుకోలేక ఆమె ఓటమికి పావులు కదపారని కవిత వర్గం భావిస్తోందంట. 

గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడు అని తనకు తాను ప్రచారం చేసుకునే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మాజీ  ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచి  గెట్ అవుట్ అంటూ బయటకు గెంటేసినట్లు  జోరుగా ప్రచారం సాగుతోంది. అ మాజీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటూ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తు పోయినట్టు సమాచారం. కేసీఆర్ చరిష్మా, కవిత ప్రచారాలతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. 

తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జీవన్ రెడ్డి ఎంపీగా కవిత ఓటమిలోనూ కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కేసీఆర్ కన్నెర్ర చేసి ఫాంహౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కావడంలో కీలకపాత్ర పోషించినట్లు నాటి నుంచి చర్చ జరుగుతోంది. కవిత ఓటమి తర్వాత ఆయన తన మందిమగధులతో హైదరాబాద్, గోవా, దుబాయ్ లలో దావతులు చేసుకున్నట్లు జీవన్‌రెడ్డి అనుచరులే అంటున్నారంట. కవిత ఓటమి వెనుక జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమ వ్యవహారాలు,  అతడిని ఫామ్ హౌస్ నుంచి గెంటేసిన దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డూ అదుపూ లేకుండా దోచుకుని,  రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అతడిని నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓటమి తర్వాత జీవన్‌రెడ్డి ఏదో చుట్టపు చూపుగా, అది కూడా ఎవరికీ తెలియకుండా అర్మూర్ వచ్చిపోతున్నారంట.  అది కూడా తన ఆస్తుల సంరక్షణ కోసమే అంటున్నారు.అధికారంలో ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి అడ్డగోలు వ్యవహారాలు నడిపి  ఓటమి తర్వాత పార్టీని గాలికి వదిలేశారంట. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని గత కొంతకాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డిలు కూడా ఉన్నారంటున్నారు. సిఎంఆర్ బియ్యం కుంభకోణంలో షకీల్ తప్పించుకుని తిరుగుతుండగా,  మూడో స్థానంలో ఓటమిపాలైన మరో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవడంపై  కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సొంత పార్టీ వ్యవహరాల్లో తనకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కనీసం ప్రెస్ మీట్ సైతం పెట్టలేదని,  దాంతోపాటు అనేక అంశాలు  కేసీఆర్ దృష్టికి రావడంతో ఆయన జీవన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట. 

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  నిత్యం కేసీఆర్‌తో ఫామ్ హౌస్ లో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు కొందరు సన్నిహితులకు, ఇతర పార్టీలో ఉన్న వారికి వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు కేసిఆర్, కేటీఆర్ నోటీస్ చేశారంట. అందుకే కేసీఆర్ అతడిని ఫామ్ హౌస్ నుంచి గెటవుట్ అని పంపించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్టీ   అంతర్గత వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు ప్రత్యర్ధి పార్టీ నాయకులకు చేరవేశారని జీవన్‌రెడ్డిపై కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అధికారంలో ఉన్న సమయంలో నియోజవర్గంలో,  హైదరాబాదులో విచ్చలవిడిగా భూ అక్రమణులకు పాల్పడ్డారని,  బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారని అలాంటి వ్యక్తిని భవిష్యత్తులో దరిదాపుల్లోకి రానివ్వొద్దని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.