జీవన్‌రెడ్డిని ఫాంహౌస్ నుంచి గెంటేసిన కేసీఆర్... అందుకేనా?
Publish Date:Jul 16, 2025
.webp)
Advertisement
గెటవుట్ ఫ్రమ్ మై ఫామ్‌హౌస్.. నా బిడ్డ ఓటమికి కారణం నువ్వే అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై గులాబీబాస్ ఫైర్ అయ్యారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే జీవన్‌రెడ్డి ఫామ్ హౌస్ కి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారట. కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు ఎమ్మెల్యేలు సహకరించలేదని బహిరంగంగా చెప్పిన మాట ఇప్పుడు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. కవితకు సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్‌కి నమ్మిన బంటుగా వ్యవహరించిన జీవన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కవిత ఆధిపత్యాన్ని ఒప్పుకోలేక ఆమె ఓటమికి పావులు కదపారని కవిత వర్గం భావిస్తోందంట.
గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడు అని తనకు తాను ప్రచారం చేసుకునే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచి గెట్ అవుట్ అంటూ బయటకు గెంటేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అ మాజీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటూ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తు పోయినట్టు సమాచారం. కేసీఆర్ చరిష్మా, కవిత ప్రచారాలతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జీవన్ రెడ్డి ఎంపీగా కవిత ఓటమిలోనూ కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కేసీఆర్ కన్నెర్ర చేసి ఫాంహౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కావడంలో కీలకపాత్ర పోషించినట్లు నాటి నుంచి చర్చ జరుగుతోంది. కవిత ఓటమి తర్వాత ఆయన తన మందిమగధులతో హైదరాబాద్, గోవా, దుబాయ్ లలో దావతులు చేసుకున్నట్లు జీవన్‌రెడ్డి అనుచరులే అంటున్నారంట. కవిత ఓటమి వెనుక జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమ వ్యవహారాలు, అతడిని ఫామ్ హౌస్ నుంచి గెంటేసిన దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డూ అదుపూ లేకుండా దోచుకుని, రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అతడిని నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓటమి తర్వాత జీవన్‌రెడ్డి ఏదో చుట్టపు చూపుగా, అది కూడా ఎవరికీ తెలియకుండా అర్మూర్ వచ్చిపోతున్నారంట. అది కూడా తన ఆస్తుల సంరక్షణ కోసమే అంటున్నారు.అధికారంలో ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి అడ్డగోలు వ్యవహారాలు నడిపి ఓటమి తర్వాత పార్టీని గాలికి వదిలేశారంట. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని గత కొంతకాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డిలు కూడా ఉన్నారంటున్నారు. సిఎంఆర్ బియ్యం కుంభకోణంలో షకీల్ తప్పించుకుని తిరుగుతుండగా, మూడో స్థానంలో ఓటమిపాలైన మరో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సొంత పార్టీ వ్యవహరాల్లో తనకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కనీసం ప్రెస్ మీట్ సైతం పెట్టలేదని, దాంతోపాటు అనేక అంశాలు కేసీఆర్ దృష్టికి రావడంతో ఆయన జీవన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిత్యం కేసీఆర్‌తో ఫామ్ హౌస్ లో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు కొందరు సన్నిహితులకు, ఇతర పార్టీలో ఉన్న వారికి వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు కేసిఆర్, కేటీఆర్ నోటీస్ చేశారంట. అందుకే కేసీఆర్ అతడిని ఫామ్ హౌస్ నుంచి గెటవుట్ అని పంపించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు ప్రత్యర్ధి పార్టీ నాయకులకు చేరవేశారని జీవన్‌రెడ్డిపై కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో నియోజవర్గంలో, హైదరాబాదులో విచ్చలవిడిగా భూ అక్రమణులకు పాల్పడ్డారని, బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారని అలాంటి వ్యక్తిని భవిష్యత్తులో దరిదాపుల్లోకి రానివ్వొద్దని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-why-kcr-kicked-jeevan-reddy-out-of-farmhouse-39-202092.html












