ఏపీ నుంచి పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోయాయి?
Publish Date:Jul 18, 2026
Advertisement
తెలుగువన్ ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలో విజయవంతంగా రాణిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలు తమంతట తాముగా వెళ్ళిపోలేదని, నాటి ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులు, వాటా ఇస్తేనే వ్యాపారం అనే దౌర్భాగ్య విధానాల వల్లే పారిశ్రామికవేత్తలు దండం పెట్టి మరీ ఏపీని వదిలి పారిపోయారని తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ విశ్లేషకుడు సువేరా అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన సంచలన నిజాలను వెల్లడించారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీస్ గ్లోబల్ కర్మాగారం ప్రారంభోత్సవ నేపథ్యంలో ఏపీ పారిశ్రామిక విధ్వంసంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని పక్కనబెట్టి.. కేవలం తమ సొంత బినామీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే వైఎస్ కుటుంబం మొదటి నుంచి ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు బలవంతపు ల్యాండ్ పూలింగ్స్, అధికార దుర్వినియోగంతో చెరబట్టారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసే ఈ చెంబల్ వ్యాలీ బందిపోటు సంస్కృతి వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిన్నదని, కేవలం లంపెన్ శక్తులను, అసాంఘిక మూలకాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేశారని సువేరా విశ్లేషించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ పాలన తిరిగి గాడిలో పడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాల పారిశ్రామిక అనుభవం, మంత్రి నారా లోకేష్ నిరంతర శ్రమతో మళ్లీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న సువేరా.. అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులు వస్తుండటం శుభపరిణామన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటూ ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇలాంటి పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కథనాన్ని ముగించారు. Why Industries Left Andhra Pradesh, Suvera Analysis, TeluguOne, AmarRaja Batteries, Chandrababu Naidu Investments AP, AP Past Government Industry Scams
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు. ఒక గ్లోబల్ టెక్నాలజీ కలిగిన అమరరాజా సంస్థను బెదిరించడం వల్లే వారు వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించారని, నిన్న దివిటిపల్లిలో జరిగిన కనులపండువ లాంటి ప్రారంభోత్సవమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీలో ఉపాధి కోల్పోయిన యువత తరపున నారా లోకేష్ క్షమాపణలు చెప్పడం నాటి దుస్థితికి అద్దం పడుతోందన్నారు.
http://www.teluguone.com/news/content/-why-industries-left-andhra-pradesh-25-226400.html





