ఊరికే రారు మహాను భావులు.. అంబటి, ఉండవల్లి గుంటూరు ట్రిప్ మర్మమేంటో?

Publish Date:Dec 15, 2025

Advertisement

గుంటూరులో  ఇటీవల   ఉండవల్లి అరుణకుమార్, అంబటి రాంబాబు కలిసి,  ఇద్దరు మాజీ ఎంపీలు, టీడీపీ నాయకులు యలమంచిలి శివాజీ, రాయపాటి సాంబశివరావులను కలిశారు. వారిద్దరూ ఆనారోగ్యంతో ఉన్నారని పరామర్శకు వెళ్ళామని అంబటి ఒక వీడియో చేసి యూట్యూబ్ లోని తన సొంత సైట్‌లో పెట్టారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.  తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి?  ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. 

అంబటి రాంబాబు అప్పుడెప్పుడో అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట, 1989లో రేపల్లెలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదైపోయాక మళ్లీ 2019లో వైసీపీ నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు మంత్రిగా కూడా పని చేశారు.  అంతే మళ్లీ ఆయన్ని సత్తెనపల్లికి కూడా పనికిరాడని తేల్చేసిన జగన్ జిల్లా మార్చేసి.. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఆయన ఆశలు పెట్టుకున్న గుంటూరు వెస్ట్ పార్టీ బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. దాంతో అంబటి వారు నియోజకవర్గం లేని మాజీ మంత్రిగా మిగిలిపోయారు.

అదలా ఉంటే రాజధాని  అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు జిల్లాలో వైసీపీకి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అమరావతిపై కమ్మ సామాజికవర్గం ముద్ర వేసి, ఆ ఆక్కసుతో అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన వైసీపీకి జిల్లా వాసులు తగిన బుద్ది చెప్పారు. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. ఆ క్రమంలో జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఆ ఎఫెక్ట్‌తో ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్చార్జులకు బాధ్యతలు కట్టబెడుతోంది. అందులో భాగంగానే తమ పార్టీపై ఉన్న కమ్మ వ్యతిరేక ముద్రను తుడిచేసుకోవడానికి అంబటి రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు. పొలిటికల్‌గా ఎక్స్‌పైర్ అయిపోయి, దాదాపు అందరూ మర్చిపోతున్న టీడీపీ మాజీ ఎంపీలు, గుంటూరులో సీనియర్ కమ్మ నేతలు రాయపాటి సాంబశివరావు, యలమంచిలి శివాజీలు అందుకే అంబటికి గుర్తు కొచ్చారంటున్నారు. ఏదో ఒక వంక చెప్పి వారితో మాట్లాడివస్తే, లేనిపోని విమర్శలు వస్తాయి కాబట్టి... వారి అనారోగ్యం పేరు చెప్పి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కలిసి వారిని కలిసి వచ్చారు.

ఆ సందర్భంగా 80 ఏళ్లు పైబడిన యలమంచలి శివాజీ రాజ్యసభ స్థానానికి ఇప్పటికీ అర్హులని అయన్ని అందలానికెక్కించేసేలా మాట్లాడారు.  ఈ సందర్భంగా ఉండవల్లికి సోదరుడు వరుసయ్యే రఘు అనే పెద్దాయన్ని కలిస్తే.. ఆయన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి అయిపోతారని జోస్యం చెప్పేశారు.

అదలా ఉంటే వైఎస్ కు అంబటి , ఉండవల్లి ఇద్దరూ ఆప్తులు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు కూడా. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించేసిన ఉండవల్లి   సమయం వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబును విమర్శిస్తుంటారు.  జగన్ పై కూడా విమర్శలు చేసినా అవి చాలా సున్నితంగా, జనగ్ హితం కోరి ఇస్తున్న సలహాల్లా  ఉంటాయి. అటువంటి ఉండవల్లి ఇప్పుడు  పనిమాలా గుంటూరు రావడం, అంబటితో కలసి రాయపాటిని, శివాజీ ని కలవడం.. శివాజీ రాజ్య సభలో ఉండాల్సిన వారంటూ పొగడ్తలు కురిపించడం వెనుక ఎదో మతలబు ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సొంత పార్టీలో నియోజకవర్గం లేక .. టీడీపీ మాజీలైన కమ్మ దిగ్గజాలతో అలా కానిచ్చేస్తున్న అంబటి లెక్కలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.