ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ సరఫరా..యువతి అరెస్ట్.!

Publish Date:Oct 15, 2026

Advertisement

ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!

ప్రియుడిని జైలు నుంచి బయటకు తీసుకురావాలనే ఆరాటం.. డబ్బు కోసం అడ్డదారి.. చివరికి కటకటాల వెనక్కి చేరిన యువతి.. ప్రేమ కోసం ఏదైనా చేయాలనుకుంది. కానీ ఆ నిర్ణయం ఆమె జీవితాన్నే చిక్కుల్లోకి నెట్టింది. ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

విజయవాడలోని పటమట ప్రాంతానికి చెందిన నాగసౌమ్య అనే యువతి.. తన ప్రియుడు కాశీవర్ధన్ జైలులో ఉండటంతో అతడిని బయటకు తీసుకురావాలని భావించినట్లు సమాచారం. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన కాశీవర్ధన్ చిత్తూరు జైలులో ఉన్నాడు. అతడికి బెయిల్ ఇప్పించాలంటే డబ్బు అవసరం కావడంతో.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు కృష్ణలంకకు చెందిన బషీర్. బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్ తీసుకొస్తే భారీగా కమీషన్ ఇస్తానంటూ నాగసౌమ్యకు ఆశ చూపినట్లు సమాచారం. ప్రియుడిని బయటకు తీసుకురావాలనే ఆరాటంలో ఆమె ఆ ప్రలోభానికి లొంగింది. ప్రేమ కోసం మొదలైన ప్రయత్నం.. ఆమెను డ్రగ్స్ రవాణా అనే ప్రమాదకరమైన నేరంలోకి నెట్టింది. బెంగళూరుకు వెళ్లిన నాగసౌమ్య అక్కడి నుంచి సుమారు 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను రెండు ప్యాకెట్లలో సేకరించింది. వాటిని ప్రత్యేకంగా దుస్తుల్లో కుట్టించిన జేబుల్లో దాచుకుని హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది. 

తన ప్రయాణం ఎవరికీ అనుమానం కలిగించదని భావించిందో ఏమో.. కానీ పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేకపోయింది.ముందుగా అందిన సమాచారంతో ఈగల్, జీఆర్పీ పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టారు. రైలు చేరుకున్న సమయంలో పోలీసుల తనిఖీలను గమనించిన నాగసౌమ్య భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే బషీర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే పోలీసులు నాగసౌమ్యను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. దుస్తుల్లో దాచిన ఎండీఎంఏ ప్యాకెట్లు బయటపడ్డాయి.

డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నాగసౌమ్యను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బషీర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ప్రియుడికి బెయిల్ ఇప్పించాలనే ఆశ.. చివరికి తనకే జైలు శిక్ష పడే పరిస్థితిని తీసుకొచ్చిందా? ప్రేమ పేరుతో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎంతటి ప్రమాదంలోకి నెట్టగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. వ్యసనాలు, డబ్బు ఆశ, తప్పుడు పరిచయాలు.. ఏ కారణమైనా సరే, నేరానికి పాల్పడితే దాని పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. ప్రేమతో ఒకరిని కాపాడాలనుకున్న ప్రయత్నం.. చివరికి తన జీవితాన్నే చిక్కుల్లో పడేసిన విషాద ఘటనగా ఇది నిలిచింది.

 

 

[ Vijayawada Drug Case, Naga Soumya Arrest, MDMA Drugs Seized, Vijayawada Railway Station, Eagle Team, GRP Police, AP Crime News, Drug Smuggling Case, Naga Soumya arrest, railway station drug raid, AP crime news, Telugu One News, Telug News ]

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.