విజయ్–రష్మికపై ట్రోలింగ్.. పోలీసులను ఆశ్రయించిన టీమ్.!

Publish Date:Oct 26, 2026

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కొద్ది రోజులుగా నెట్టింట తీవ్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకత, మార్ఫింగ్ చేసిన స్క్రీన్‌షాట్లు మరియు దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకున్న వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.   ఓ ప్రముఖ టెలివిజన్ టాక్ షోలో ఈ జోడి పాల్గొన్న తర్వాత సోషల్ మీడియా వేదికగా వీరిపై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అయితే ఈ విమర్శలు కేవలం అభిప్రాయాల వ్యక్తీకరణ హద్దులు దాటి, పూర్తిగా కల్పిత కంటెంట్ వ్యక్తిగత దూషణల స్థాయికి చేరాయని విజయ్, రష్మికల సన్నిహిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

తమపై కావాలనే కొందరు వ్యక్తులు వ్యవస్థీకృత నెగెటివ్ క్యాంపెయిన్‌ను నడుపుతున్నారని ఆరోపిస్తూ బాధితుల తరపు బృందం సైబర్ పోలీసులకు తగిన ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేసింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను సృష్టిస్తూ, తమ గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో స్పష్టంగా కోరారు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, దీనికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు సమాచారం. కేవలం ఫ్యాన్ వార్స్ లేదా అభిప్రాయాల పేరుతో కొందరు క్షద్ర రాజకీయాలకు పాల్పడుతూ సమాజంలో తప్పుడు సంప్రదాయానికి తెరలేపుతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇటీవల కాలంలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు మరియు ఫేక్ పోస్టులను వైరల్ చేయడం పెరిగిపోయిందని, దీనివల్ల నటీనటుల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్-రష్మిక టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాను ఆయుధంగా మలచుకుని సెలబ్రిటీలపై ఇష్టానుసారం విరుచుకుపడే ట్రోలర్స్‌కు ఈ ఫిర్యాదు ఒక గట్టి హెచ్చరికలా నిలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సైబర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు త్వరలోనే తప్పుదోవ పట్టించే పోస్టులు చేసిన అకౌంట్లపై విచారణ వేగవంతం చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 

 

 

[ Vijay Deverakonda, Rashmika Mandanna, Cyber Crime Police Hyderabad, Virosh online harassment, Telugu film news, Cyber Crime Complaint, Hyderabad Police, Social Media Trolling, ViRash ]


 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.