విలన్ ఆఫ్ ది మిలీనియం ఇకలేరు
Publish Date:Jul 13, 2013
Advertisement
బ్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇకలేరు.. ఎన్నో విలక్షణ పాత్రలతో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ప్రాణ్ శుక్రవారం కన్నుమూశారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రాణ్.. మూడు వారాలగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో శనివారం మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించనున్నారు. 93 సంవత్సరాల ప్రాణ్ తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈ ఏడాదే అందుకున్నారు. ప్రాణ్ పూర్తి పేరు ప్రాణ్ కిషన్ సికంద్. 1920, ఫిబ్రవరి 12న పాతఢిల్లీలోని ఒక జన్మించిన ఆయన 1940లో యమలా జాట్ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 1960, 70ల్లో విడుదలైన భారీ బడ్జెట్ హిందీ సినిమాలన్నిటిలోనూ ఆయన నటించారు. ఆయన కెరీర్‌లో మధుమతి, కశ్మీర్ కీ కలి, మిలాన్ వంటి క్లాసిక్స్ ఉన్నాయి. డాన్, అమర్ అక్బర్ ఆంటోనీ, జంజీర్ వంటి బాక్ల్‌బస్టర్ సినిమాల్లో ఆయన ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. హిందీలోనే కాదు తాండ్రపాపరాయుడు కొదమసింహం లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..
1990 నుంచి ఆరోగ్య కారణాలతో నటనకు దూరంగా ఉంటున్నారు ప్రాణ్. 2000 సంవత్సరంలో స్టార్ డస్ట్ పత్రిక ఆయన్ను 'విలన్ ఆఫ్ ద మిల్లీనియం'గా అభివర్ణించింది. సీఎన్ఎన్ ప్రకటించిన ఆసియాలో టాప్ 25 నటుల జాబితాలో ప్రాణ్ కూడా ఉన్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌తో గౌరవించింది.
మేటి నటునిగా ఇండియన్ సినిమాకు ఎన్నో అత్యున్నత పాత్రలను అందించిన ప్రాణ్ లేనిలోటు ఎప్పటికీ పూడ్చలేనిది..
http://www.teluguone.com/news/content/-veteran-bollywood-actor-pran-passes-away-32-24272.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





