టీమ్ ఇండియా తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎప్పుడంటే..?

Publish Date:Jul 3, 2026

Advertisement

అంతర్జాతీయ  క్రికెట్ లో  యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెన్స్ టీంలో అరంగేట్రం పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించకపోవడంపై క్రికెట్ దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు.   15 ఏళ్ల వయస్సులోనే తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది.  ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే..  ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి.   ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా  నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ  ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.  ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో..   వైభవ్   అద్భుతమైన ప్రతిభావంతుడైన క్రికెటర్ అన్న ఆయన.. ఆ విషయంలో బీసీసీఐకి ఎలాంటి సందేహాలు లేవన్నారు.  ఇప్పటికే  ఐపీఎల్‌లో  సత్తా  నిరూపించుకున్న వైభవ్ ను టీమ్ ఇండియా తుది జట్టులో ఎప్పుడు దించాలన్న నిర్ణయం   పూర్తిగా జట్టు యాజమాన్యానిదేని స్పష్టం చేశారు.  ఈ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల నిర్ణయాలకు బీసీసీఐ  మద్దతు ఇస్తుందన్నారు. మ్యాచ్ పరిస్థితులను బట్టి సరైన సమయం వచ్చినప్పుడు మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా వైభవ్‌కు అవకాశం కల్పిస్తుందన్నారు. 

నిజానికి ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఈ మెగా టోర్నీలో కేవలం 16 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతడు  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కించుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ టోర్నీలో అతడు 237.30 అనే భారీ స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు.  వైభవ్ అగ్రెసివ్ బ్యాటింగ్  కారణంగానే సెలక్టర్లు అతడిని జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడి అరంగేట్రం ఖాయమని అందరూ అనుకున్నప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అనుభవజ్ఞులైన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ల ఓపెనింగ్ జోడీకే మొగ్గు చూపింది. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్‌లోనూ వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపైనే స్పందించిన రాజీవ్ శుక్లా.. జట్టు కూర్పుకు సంబంధించిన వ్యూహాు పూర్తిగా జట్టు యాజమాన్యానివేనన్నారు. రాజీవ్ శుక్లా ఇచ్చిన క్లారిటీతో వైభవ్ సూర్యవంశి అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పదని అవగతమౌతోంది. 

Rajeev Shukla BCCI, Gautam Gambhir, Shreyas Iyer, India vs England T20, Vaibhav Suryavanshi stats

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.