ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!

Publish Date:Jul 22, 2026

Advertisement

 

వేధింపుల కేసు.. షీ టీమ్స్‌కు బదిలీ..!

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసు ఉన్నతాధికా రులు, ఇప్పటివరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న దర్యాప్తును ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణ లో ఇకపై కేసు విచారణ కొనసాగనుంది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీసీపీ లావణ్య బుధవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా భావిస్తున్న బాధిత మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఆమె అకాడమీకి వెళ్లారు. అకాడమీ అధికారుల సమక్షంలో అధికారికంగా స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. 

బాధిత అధికారిణి ఇచ్చే వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ములగాని ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వైద్యుల అనుమతితో ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. కేసు దర్యాప్తులో ఆయన వర్షన్ కూడా కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి పేరుతో ఉన్నట్లు భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి, అందులోని రాతలు, వివరాలపై నిపుణులతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూసైడ్ నోట్‌లోని అంశాలను కేసులో లభించిన ఇతర ఆధారాలతో సరిపోల్చి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ములగాని ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

 తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జే. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు.
ఇంకా తన వాదనలు వినిపి చేందుకు ప్రయత్నించగా, పూర్తి స్థాయిలో వచ్చే సోమవారం విచారణ చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

దీంతో కేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం కావడం, మరోవైపు హైకోర్టులో న్యాయపరమైన విచారణ కొనసాగుతుండటంతో ఈ కేసు మరింత కీలక దశకు చేరుకుంది. బాధిత అధికారిణి వాంగ్మూలం, ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి స్టేట్‌మెంట్, సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ నివేదిక, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా దర్యాప్తు తదుపరి దిశ నిర్ణయించబడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

 Trainee IPS Uday Krishna Reddy, Telangana High Court, Attapur Police Station, DCP Lavanya Naik Jadhav, Trainee IPS harassment case, She Teams Hyderabad, IPS officer sexual harassment case
 

By
en-us Political News

  
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.