రైస్ మిల్లర్ల అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు..16 మంది మిల్లర్లు అరెస్ట్.!

Publish Date:Oct 25, 2026

Advertisement

తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం కలిగిస్తున్న అక్రమ రైస్ మిల్లర్లపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేయగా, మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

 ప్రాథమిక విచారణ ప్రకారం ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.96 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విధానంలో అప్పగించగా, కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన నాణ్యమైన సన్న బియ్యానికి బదులుగా, బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభించే దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

 మరోవైపు, ప్రభుత్వానికి చెందిన ధాన్యం, బియ్యాన్ని అక్రమ మార్గాల్లో ఇతర వ్యాపారులకు విక్రయించి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీఎంఆర్ బియ్యం నిల్వలు, లెక్కల్లో భారీ వ్యత్యాసాలు గుర్తించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించగా పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో, సంబంధిత ఆధారాలతో కూడిన నివేదికను సీఐడీకి అందజేసి ఫిర్యాదు చేశారు. 

దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందాలు నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, ములుగు, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు రైస్ మిల్లులు, కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ధాన్యం నిల్వలు, రికార్డుల మధ్య భారీ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. నకిలీ వేబిల్లులు, రిజిస్టర్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకుని కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. 

అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో రైస్ మిల్లర్లతో పాటు వారికి సహకరించినట్లు అనుమానిస్తున్న అధికారులు, మధ్యవర్తుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిన విధానం, అక్రమాలకు పాల్పడిన వారి నెట్‌వర్క్‌పై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు పురోగతిని బట్టి ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించారు.

 

 

 

[ Telangana Rice Mill Scam, CID Raids, Telangana CID, Rice Millers Arrested, ₹96 Crore Scam, Telangana Civil Supplies Department, Custom Milling Rice (CMR), Public Distribution System (PDS), Government Paddy Scam, Rice Mill Irregularities, Paddy Diversion, Rice Supply Fraud, Food Grain Scam, Telangana Corruption Case ]

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.