రైతుల కన్నీళ్లే ఈ రోజు అమరావతికి పునాదిరాళ్లు.. పెమ్మసాని

Publish Date:Apr 1, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక,శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం బుధవారం (ఏప్రిల్ 1) లోక్ సభలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఎన్డీయే కూటమికి చెందిన ఏపీ సభ్యులు, కేంద్ర మంత్రులు ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొని గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  మూడు రాజధానులంటూ జగన్ తన ఐదేళ్ల హయాంలో  రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నారని, ఈ చారిత్రాత్మక బిల్లుతో ఆ గందరగోళానికి పర్మనెంటుగా  తెరపడిందనిన్నారు. 

సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్  గత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక రంగు మార్చి మూడు రాజధానులన్నారని దుయ్యబట్టారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవన్నారు.  ఈ బిల్లు ద్వారా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధ రక్షణ లభించిందని, రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం ఇక ఎవరికీ సాధ్యం కాదని సీఎం రమేష్ అన్నారు.

అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని అమరావతి రైతుల పోరాటాన్ని ప్రస్తావిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.  రాజధాని కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులను గత ప్రభుత్వం 'పెయిడ్ ఆర్టిస్టులు' అని దారుణంగా  అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  1600 రోజులకు పైగా సాగిన అమరావతి రైతుల మహోద్యమంలో  మహిళలు, వృద్ధులపై జరిగిన దాడులను ఆయన ఈ సందర్భంగా సభకు తెలియజేశారు. ఆనాడు రైతులు చిందించిన కన్నీళ్లే ఈరోజు అమరావతికి పునాదిరాళ్లుగా మారాయని పెమ్మసాని అన్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు  ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అమరావతి వంటి ఒకే ఒక శక్తివంతమైన రాజధాని అవసరమని,  జగన్ ఐదేళ్ల హయాంలో జరిగిన    పాలనా  వైఫల్యాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారని ఈ బిల్లుపై ప్రసంగించిన ఎంపీలు అన్నారు. రాజధానిని నిర్ణయించే అత్యున్నత అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న గత కోర్టు తీర్పుల ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ బిల్లు ఆమోదంద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోవడంతో, ఇక  అభివృద్ధి పనులు మరింత వేగంపుంజుకుంటాయని జనం అభిప్రాయపడుతున్నారు.  రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు రాజధాని ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.