ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్.. రెండో వన్డేలో టీమ్ ఇండియా ఓటమి.!

Publish Date:Jul 17, 2026

Advertisement

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రెండో వన్డేలో టీమ్ ఇండియా పరాజయం పాలైంది.  కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో   ఇంగ్లండ్  టీమిండియాపై 4 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. తొలి వన్డేలో టీమ్ ఇండియా సునాయాస విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో   మూడు వన్డేల సిరీస్  1-1 తో సమం అయ్యింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మూడో వన్డే ఈ లార్డ్స్ వేదికగా ఈ నెల 19న జరగనుంది. 

ఇక రెండో వన్డే విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది.    విరాట్ కోహ్లీ 65, శ్రేయస్ అయ్యర్ 66 పరుగులతో రాణించడంతో టీమ్ ఇండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరిద్దరూ వినా మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ బాటపట్టారు.  ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు తీయగా, సాకిబ్ మహ్మూద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం  234 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్   ఆరంభంలోనే  వికెట్లు కోల్పోయింది.  ఒక దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ ను  జో రూట్  అద్భుత ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు.   విల్ జాక్స్‌తో కలిసి 6వ వికెట్‌కు  72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన జో రూట్ 133 బంతుల్లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, జట్టును విజయతీరాలకు చేర్చి మ్యాచ్ హీరోగా నిలిచాడు.  ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు తలో వికెట్ దక్కింది.  

virat kohli half century, shreyas iyer 66, india vs england odi series 1-1

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ సతీమణి..!
రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి భారత షట్లర్‌గా ఘనత..!
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.