వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్..63 ఎకరాల ఆక్రమిత భూమి స్వాధీనం

Publish Date:May 21, 2025

Advertisement

 

 

వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు సర్వే చేశారు. సికే దిన్నె రెవెన్యూ సర్వే నెం.1629లో 11 వేల ఎకరాలు ఉండగా మొత్తం 63 ఎకరాలను సజ్జల ఫ్యామిలీ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో 52 ఎకరాలు అటవీ భూములుగా నిర్ధారణ అయింది. ఇందులో హద్దులు పాతి, బోర్డులు సైతం పెట్టారు. ఈ మేరకు గురువారం అటవీ శాఖకు 52 ఎకరాల భూములను రెవెన్యూ అధికారులు అప్పగించనున్నారు. కాగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నేషనల్ హైవే పక్కన సజ్జల ఫ్యామిలీకి ఎస్టేట్ ఉంది. సర్వే నెంబర్1599, 1600/1,2,1601/1,1A, 2తో పాటు మరికొన్ని సర్వేల నెంబర్లలో మొత్తం 200 ఎకరాలకు పైగా భూములున్నాయి. 

ఇందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి కుమారు సందీప్ రెడ్డి పేరుతో 130 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరుతో మిగిలి భూములు సజ్జల ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ భూములు సైతం ఉన్నాయి. 200 ఎకరాల్లో 146 ఎకరాలు పట్టా భూమి కాగా 5.14 ఎకరాలు డీకేటీ, రెండు ఎకరాలకు పై చిలుకు చుక్కల భూములుగా ఉన్నాయి. అయితే పక్కనున్న సర్వే నెం. 1629లోని ఫారెస్ట్  భూములు, రిజర్వు భూములను కూడా ఎస్టేట్‌లో కలుపుకున్నట్లు ఆరోపణలు ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు చేశారు. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ అయ్యారు. దీంతో ఆక్రమణకు గురైన భూములను అటవీ శాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేశారు.  దీనిపై ఇప్పటికే కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సీకే దిన్నె తహశీల్దార్‌ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు పాతి, బోర్డులు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు.
 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.