ఆర్జేడీ అధ్యక్షుడిగా 13వ సారి లాలూ ప్రసాద్
Publish Date:Jun 24, 2025
.webp)
Advertisement
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో తేజస్వీ యాదవ్, రబ్రీ దేవి, మీసా భారతి, సీనియర్ నాయకుల సమక్షంలో లాలూ నామినేషన్ దాఖలు చేశారు. వేరే అభ్యర్థులు పోటీ చేయకపోవడంతో లాలూ ఎన్నిక ఖాయమైంది. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. లాలూ నాయకత్వం పార్టీకి బలమని, రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోతప్పకుండా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా జూలై 5న "లాలూ సమ్మాన్ దివస్" జరుపుకోనున్నారు.
1997లో ఆర్జేడీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి లాలూ నాయకత్వం వహిస్తుండగా.. బీహార్‌లో OBCలు, దళితులు, ముస్లింల మద్దతుతో ఆర్జేడీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. 78 ఏళ్ల లాలూ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన నాయకత్వం కొనసాగిస్తూ.. కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ పునఃనియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం తన 78వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. పాట్నాలోని నివాసంలో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో కట్ చేశారు. ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
http://www.teluguone.com/news/content/-rjd-39-200589.html












