జగన్ ఇలాకాలో పసుపు పార్టీ పంచ్..ఐదు ఎంపీటీసీలు ఏకగ్రీవం.!

Publish Date:Oct 27, 2026

Advertisement

వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది. పులివెందుల మండల పరిధిలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండలంలోని మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం కూడా టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు స్పష్టమయ్యాయి. దీంతో పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఏకగ్రీవాల్లో పుష్పనాథ్‌రెడ్డి కీలక పాత్ర.!

పులివెందుల మండలంలోని కొత్తపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు పుష్పనాథ్‌రెడ్డి ఐదు ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవంలో కీలక పాత్ర పోషించారు. కొత్తపల్లి ఎంపీటీసీ స్థానానికి తాను ప్రాతినిధ్యం వహించడంతో పాటు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సూచనల మేరకు మిగిలిన నాలుగు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి, అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకునే దిశగా కృషి చేశారు. 


ఆయన ప్రయత్నాలు ఫలించడంతో మండలంలోని ఐదు స్థానాలూ టీడీపీకి దక్కాయి. పులివెందుల మండల పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు ఎంపీటీసీలు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రాలను అందుకున్నారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఈ. కొత్తపల్లి నుంచి మాడెం పుష్పనాథ్‌రెడ్డి, ఎర్రబల్లి-2 నుంచి కడపన శ్యామలాదేవి, ఎర్రబల్లి-1 నుంచి పండిటి రాజశేఖర్, రాగిమానుపల్లి నుంచి బండి సునీత, అచ్చవెల్లి గంగనపల్లి నుంచి మహమ్మద్ షరీఫ్ ఉన్నారు.

 ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి.!

పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో త్వరలో జరగనున్న ఎంపీపీ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐదు స్థానాలూ ఒకే పార్టీకి దక్కడంతో ఎంపీపీ పదవి కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉంది.పులివెందులలో గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకోనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీపీ ఎన్నిక పూర్తయితే మండల పరిషత్‌లో అధికార మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.

 

 

 

[ Pulivendula Politics, YS Jagan Mohan Reddy, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, B Tech Ravi, Kadapa Political News, Pulivendula MPTC Elections, MPTC Unopposed Elections, TDP Victory, Pulivendula MPP Election, Kadapa Local Body Elections, Andhra Pradesh Politics, Coalition Alliance, Madem Pushpanath Reddy ]

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.