బాగా చదువుకున్నాడు... ఇతర రాష్ట్రానికి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించాడు. కానీ అడ్డదారిన అడ్డగోలుగా సంపాదించి సంపన్నుడు కావాలన్న దురాశతో తప్పుదోవ పట్టాడు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అంతర్రాష్ట్ర బెట్టింగ్ సామ్రా జ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా గత ఐదు సంవత్సరాలు గా అంతర్రాష్ట్ర బెట్టింగ్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబడుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ పాత గుంటూరుకి చెందిన తోకల నగేష్ (45) అనే వ్యక్తి మహావీర్ కళాశాల నాగార్జున విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు. చదువు పూర్తి అయిన తర్వాత చెన్నైలోని హ్యూ లేట్ ప్యాకర్డ్ కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో నగేష్ గుర్రపు పందాలకు బానిస అయ్యాడు. అయితే 2020 కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులతో నగేష్ చెన్నై నుండి హైదరాబాద్ కు మకాం మార్చాడు. అదే సమయంలో నగేష్ కు హైదరాబాద్ కు చెందిన రాజేష్ కుమార్, విజయవాడకు చెందిన వెంకట చౌదరి తో పరిచయం ఏర్పడింది. నగేష్ ఈ ఇద్దరితో కలిసి గుర్రపు పందాలు ప్రారంభించాడు. బాగా లాభాలు వస్తుండటంతో నగేష్ ఆ ఇద్దరి నుండి విడిపోయి హైదరాబాదు నగరంలో ఉంటూ గుర్రపు పందాలు నిర్వహించాడు. షిమ్ వెల్ ఎంటర్ ప్రైజెస్ అనే వాట్సాప్ గ్రూప్ ను సృష్టించి.. గేమింగ్ హౌస్ ఆఫ్ హార్స్ బెట్టింగ్ నిర్వహించాడు. అమాయకులను ప్రలోభ పెట్టి పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి... వారిచేత పెట్టుబడి పెట్టించేవాడు... ఈ విధంగా నిందితుడు నగేష్ అక్రమ గుర్రపు బెట్టింగ్లో దేశవ్యాప్తంగా 105 మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. అందులో 20 మంది జంట నగరానికి చెందిన వారే ఉన్నారు.
జవహర్ నగర్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే దాడులు చేసి అంతర్రాష్ట్ర గుర్రపు బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు చేసి... నగేష్, బుర్ర వెంకయ్య చౌదరి, చల్లా రమేష్ బాబు, డి సునీల్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లక్షల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, రెండు ఖాతాల్లో ఉన్న 2,47000 సీజ్ చేశారు. వెంకట్ చౌదరి, రాజేష్ కుమార్ పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు బ్యాంక్ ఖాతాలలో 8,34,50,749 లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-police-bust-interstate-horse-racing-racket-39-203400.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.