కేసీఆర్ మెడకు చుట్టుకున్న టెలిఫోన్ ట్యాప్ వైర్?
Publish Date:Jun 20, 2025

Advertisement
గోనె ప్రకాశరావు వర్షెన్ ఏంటి?
కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. పోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో.. రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు. ఈయన తన నోరు మెదపక పోయినా.. ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లు గా మారడంతో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చేస్తోందని అంటున్నారు. మాజీ డిజిపి చుట్టూ కథ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కథ వెనుక ఉన్నది కెసిఆర్, వారి కుటుంబ సభ్యులేనంటున్నారు.
ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడవసారి. గతంలో 1972లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు విజయం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది. ఇండియాలో 1988లో కర్ణాటక లో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత 2023లో కెసిఆర్ ఈ కేసులో ఇరుక్కున్నారు.
గోనె ప్రకాశరావు అప్పుడెప్పుడో 1983లో సంజయ్ విచార మంచ్ స్వతంత్ర్య అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గా గెలిచారు. వై.ఎస్. హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు. అంతకు మించి ఆయన ఏమీ చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. 1982 నుంచి 2005 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్టా తన మైండ్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నారు. శుక్రవారం (జూన్ 20) సిట్ విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులోంచి కెసిఆర్ ను ఎవ్వరూ కాపాడలేరని ఆయన జోస్యం చెప్పేసారు. ప్రభాకరరావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని, జూలై 5 తరువాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని అన్నారు.
ప్రధాని కావాలనే లక్ష్యంతో కెసిఆర్.. పార్టీని బిఆర్ఎస్ గా మార్చి చుట్టు పక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ, ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుక్కుపోయారని అన్నారు గోనె ప్రకాశరావు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్లే.. ఇప్పుడిలా ఇరుక్కుపోయారని ఆయన వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, ఇందుకు స్థానిక బిజెపి నేతలు కృషి చేయాలని కోరారు.
గోనె ప్రకాశరావుకు ఇక్కడే కాదు, అమెరికాలోనూ మన తెలుగు వారిలో విపరీతమైన క్రేజ్ ఉంది. తానా, అటా సంస్థలు నిర్వాహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాశరావు ప్యానెల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే. ప్రకాశరావు మాటలు కూడా అంతే ఆసక్తిగా అక్కడివారు విని ఎంజాయ్ చేస్తుంటారు.
http://www.teluguone.com/news/content/-phone-tapping-case-kcr-in-trouble-25-200375.html












