కాళేశ్వరం కుంగింది అందుకే...నిపుణుల మధ్యంతర నివేదిక

Publish Date:May 8, 2024

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి  ప‌లు సూచ‌న‌లు చేసింది. 
1) మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని , వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు.  

2) మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించారు.

3) 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని,  రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.  

4) బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి దఫా వరదతో, మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో సమస్యలు తలెత్తాయని, వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే, మిగతా పిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అధికారులు నివేదిక‌లో రాశారు.  మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.

5) 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలని పేర్కొన్నారు.  

6) ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేశారు. కాళేశ్వరం మరమ్మత్తులపై గైడ్ లైన్స్ ను డ్యాం సేఫ్టీ అధికారులు జారీ చేశారు. 

7)  ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్ల‌క్ష్యం వ‌ల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింద‌ని డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికలో తెలిపింది.

8) డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవటం వలనేనని తెలిపింది.  

మ‌రో వైపు మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను  జ్యుడీషియల్‌ కమిషన్‌ సందర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణలో భాగంగా బరాజ్‌లోని కుంగుబాటుకు గురైన 19, 20, 21వ పియర్లలతోపాటు ఏడో బ్లాక్‌లో వంతెనపై కాలినడకన వెళ్లి జ్యుడీషియల్‌ కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించింది.  ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్‌లో కుంగిన పియర్ల పగుళ్లను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక  అందిందని, దాన్ని అధికారుల సమక్షంలో సమీక్షిస్తున్నట్టు తెలిపారు. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.