Publish Date:Jun 23, 2025
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో ఫోన్ దొంగిలించిందనే ఆరోపణలతో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన ఎమ్మెల్యే.. బాలిక బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులను వెంటనే ఆ చిన్నారిని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం ఇప్పించాలని ప్రశాంతి రెడ్డి స్థానిక నాయకులను ఆదేశించారు.
ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కమలాకర్ రెడ్డి వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్ కి తరలించారు. ఈ అఘాయిత్యన్నికి పాల్పడిన పినతల్లి మాణిక్యం నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్ దొంగతనం చేశానని..గెంటితో ఒళ్లంతా కాల్చి కొట్టారు.చిన్నారి తల్లి వెంకట రమణమ్మ పాపని చిన్నప్పుడే సన్నారి మాణిక్యం దగ్గర వదిలేసి వేరే భర్తతో వెళ్లిపోయినట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నరు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-mla-prashanthi-reddy-25-200531.html
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైరసీకి మాత్రం ఒక్కటంటే ఒక్క ఉపాయం కూడా కనుగొనలేక పోవడం విచారకరం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే ప్రస్తుతం టాలీవుడ్ జనాలను వేధిస్తోన్న ప్రశ్న.
జపాన్ మాంగా కళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జపాన్ కి భారీ సునామీ రానుందని చెప్పడంతో.. ఎందరో తమ జపాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్కసారిగా జపాన్ టూరిజం పడకేసింది.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో కేసీఆర్ బాధపడుతున్నారు
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా? అంటే.. విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టుగా హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ శతాబ్దానికే ఇది జోక్ కావచ్చు. ఈ భూమ్యాకాశాల మధ్య కేసీఆర్ కి తెలియని రాజనీతి లేదు. రెడ్డి, కమ్మగా విడిపోయి కొట్టుకు ఛస్తున్న ఉమ్మడి ఆంధ్ర రాజకీయాల్లో వెలమల పాత్రను తిరిగి తీసుకురావడంలో అపర చాణక్యుడన్న పేరు సాధించారాయన. అంతేనా కేసీఆర్ అన్నీ తెలిసే కావాలనే చేశారని అంటారు. అలాగని కులాభిమానం అయినా ఉందా? అంటే అదీ లేదని చెబుతారు.
తిరుమల కొండపై ఏనుగులు హల్ చల్ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోనే ఏనుగుల గుంపు తిష్టవేసి ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (జులై 4)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ నారాయణ గిరి షెడ్ల వరకూ సాగింది.
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి నేడు. దేశ ఆత్మగౌరవ ప్రతీకగా జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశ భక్తులు పింగళి వెంకయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.