తెలివైన వ్యక్తి చేసే ఈ  తప్పులు.. జీవితాన్ని కల్లోలం చేస్తాయి..!

Publish Date:Nov 22, 2025

Advertisement


వ్యక్తి ఆలోచన, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు.. ఇలా వీటన్నిటి ఆధారంగా వ్యక్తి మంచివాడు అని, చెడ్డవాడు అని.. తెలివైన వాడని, తెలివి లేని వాడని చెబుతారు. అయితే.. తెలివైన వ్యక్తి జీవితాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటాడు. అందుకే అతని జీవితం ఇతరులతో పోలిస్తే మెరుగ్గా అనిపిస్తుంది. కానీ తెలివైన వ్యక్తి తన జీవితంలో చేసే తప్పులు అతని జీవితాన్ని కల్లోల్లం చేస్తాయి. ఎంతో బాగుంది అనుకునే జీవితాన్ని గందరగోళంలో నెట్టి వేస్తాయ్.  ఇంతకీ తెలివైన వ్యక్తులు చేయకూడని ఆ తప్పులు ఏమిటి? తెలుసుకుంటే.. 

అబద్దం ..

అబద్దం ఆడితే తప్పేమీ లేదని చాలా మంది అంటూ ఉంటారు. అవసరానికి అబద్దం చెప్పడం అసలు తప్పే  కాదని కూడా అంటారు. కానీ అబద్ధం చెప్పే అలవాటు సమస్యలకు దారితీస్తుంది. అబద్ధం చెప్పడం సమస్యలను పెంచడమే కాకుండా  వ్యక్తి ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. 

చర్య.. ఆలోచన.. 

తెలివైన వ్యక్తి తను చెసే  ప్రతి పనినీ, ఆ పని చేసేటప్పుడు తన ఆలోచనను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒక పక్షి తన రెండు రెక్కలు ఉపయోగిస్తెనే బాగా ఎగరగలదు. అలాగే తెలివైన వ్యక్తి  చర్య, ఆలోచన   జ్ఞానం  రెండు బాగా ఉంటేనే తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. కాబట్టి చర్యలను,  జ్ఞానాన్ని సరైన దిశలో ఉంచుకోవాలి .

గౌరవం..

నిరాకరించిన చోట, జీవనోపాధి అందుబాటులో లేని చోట, నేర్చుకోవడానికి అవకాశం లేని చోట అస్సలు ఉండకూడదు. ఇలాంటి చోట ఎదుగుదల, జ్ఞానార్జన, సరైన ఆదాయం ఉండదు.

నిజాయితీ..

సంతోషకరమైన,  విజయవంతమైన జీవితం కావాలంటే ఎప్పుడూ నిజం మాట్లాడాలి . తెలివిగా ఖర్చు చేయాలి.  నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఇలా చేసే వ్యక్తులు సంతోషంగా ఉండటమే కాకుండా, తెలివైనవారిగా పరిగణించబడతారు. 

 స్నేహం.. జాగ్రత్త..

శక్తివంతమైన శత్రువు,  బలహీనమైన స్నేహితుడు ఇద్దరూ ఇబ్బందులకు గురిచేస్తారు. అందుకే స్నేహితుల విషయంలో  ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 

ఆకలి,  తెలివితేటల మధ్య సంబంధం..

  తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. ఎందుకంటే ఆకలితో ఉండటం తెలివితేటలను బలహీనపరుస్తుంది. ఇది వ్యక్తి ఆలోచన విచక్షణను అణిచివెస్తుంది.  ఆకలితో ఉండటం కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది.


                  *రూపశ్రీ

By
en-us Political News

  
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.