మీడియాది బాధ్యతారాహిత్యం.. సీజేఐ.!

Publish Date:Jul 24, 2026

Advertisement

విద్యార్థుల నిరసనల సమయంలో   పోలీసులు లాఠీచార్జీ, దాష్టీకం, దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్   ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ అంశంపై సుప్రీం కోర్టులో రిట్ పిటీషనే దాఖలు కాలేదని పేర్కొన్న ఆయన దాఖలు కాని పిటిషన్ ను విచారణకు స్వీకరించకుండా నిరాకరించడమేంటని నిలదీశారు. మీడియా అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించిందంటూ ఫైర్ అయ్యారు.  

సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్  ఈ అంశాన్ని ప్రస్తావించారు.   డిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ ను పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొన్న ఆయన మీడియా   బాధ్యతారాహిత్యంగా ఇటువంటి కథనాలను వండివార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల ఉక్కుపాదానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు.  

కేవలం లేఖ రూపంలో వచ్చిన ఒక వినతిపత్రాన్ని   రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తామన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి..  ఎవరో  పంపిన లేఖ ఆధారంగా న్యాయస్థానం విచారణకు నిరాకరించిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. 

ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయుగోళాలు ప్రయోగించారనే ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని, వీడియో ఆధారాలను పరిశీలించాలని ఒక న్యాయవాది  మౌఖికంగా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మెన్షనింగ్ సమయంలో వీడియోలు చూసేందుకు తమ వద్ద సమయం లేదని ధర్మాసనం పేర్కొంది. సరైన నియమావళి ప్రకారం పిటిషన్ దాఖలు కాకుండానే, సీజేఐ కేసును తిరస్కరించారంటూ వార్తలు రావడంతో సీజేఐ ఈ వివరణ ఇచ్చారు.

CJI Surya Kant, Supreme Court Police Brutality Petition, Reckless Media Reporting

By
en-us Political News

  
మందుల సామేల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్..!
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడింది.
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ కీలక అడుగు వేసింది.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తీవ్ర రూపం దాల్చింది.
నా నియోజకవర్గానికి జోలికి వస్తే మీకు మర్యాద దక్కదు.. ఘాటు హెచ్చరిక..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఈరోజు కేవలం నిరసనలకు వేదికగా మాత్రమే లేవు
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి ..పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
చివరికి మర్డర్ చేయించింది కూడా సవతి తల్లే..!
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది.
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును ఈనెల 27కి రిజర్వ్ చేశారు.
ఢిల్లీలో ముగిసిన సీజేపీ రెండో విడత చర్చలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.