మానవుడే మహనీయుడు

Publish Date:Jan 30, 2014

Advertisement

 

 

గుండెనిండా స్వేచ్చా వాయువులు పీల్చినపుడల్లా అందులో ఎందరో మహనీయుల త్యాగం అంతర్లీనంగా మనలని స్పృశిస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే మన జాతిపిత గాంధీ భారతీయుల ప్రతిశ్వాసలో ఈనాటికి ఉన్నారంటే అతిశయోక్తి కాదు, అలా౦టి మహానుభావుడి వర్ధంతి ఈ రోజు, స్మరించుకోవడం, మనసులో కృతజ్ఞతలు తెలియజేయడం, అయన చూపిన మార్గంలో నడవాలని సంకల్పించుకోవడం మనందరని కనీస ధర్మం . అహింస, శాంతి,సహనం, నిత్యం మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో అవసరపడే పదునైన ఆయుధాలు, వాటిని పరీక్షించి ఫలితాలని కూడా మనముందుంచారు. బాపూజీ నిస్సంకోసంగా వాటిని వాడొచ్చు మనందరం. మహానుభావుడు పూజ్యుడు,ఆరాధ్యుడు అంటూ గాంధీని మాటలతో పూజిస్తాం కాని నిజంగా ఆయనకి గుడి కట్టి నిత్యం ధూపదీపాలతో అర్చనలు చేస్తారంటే నమ్మగలరా, కాని నిజం మన దేశంలో రెండుచిట్ల అలా గాంధీజీ ఆలయాలు ఉన్నాయి.

 

కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులోని కంకనాడిలో ఉందా గుడి. అక్కడ గాంధీయే దేవుడు. ఈ గుడి 1948 లోనే నిర్మించారు. నరసప్పసాలియాన్, సోమప్ప పండితే, వెంకటప్ప అనే వారికీ గాంధీ అంటే ప్రాణం గాడ్సే తుపాకీ గుళ్ళకి అయన నేలకొరిగారన్న వార్త విన్నాక అంతటి మహాత్ముడికి మరణం లేడు అని నమ్మి ఆయనకి గుడి కట్టారు ఈ ముగ్గురు. అప్పటినుంచి ఆ ఆలయంలో గాంధీజీ పూజలు అందుకుంటున్నారు.   నేటికి నిత్యం అర్చనలు జరుపుతారు. జాతీయ పర్వదీనాల్లో ఆ ఆలయం జన సందోహంతో కిక్కిరిసిపోతుందట.



దూర దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం మహాత్ముడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబదతారట. ఇక గాంధీ జయంతి నాడు పల్లకీసేవ ప్రత్యేకంగా ఓ ఉత్సవంలా నిర్వహిస్తారు అంతే కాదు ఆ ఆలయం చుట్టూ ప్రజల గట్టి నమ్మకం కూడా ఒకటుంది. గాంధీజీ ఆలయం గురించి దాని చుట్టూ ప్రజలఅల్లుకున్న విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మద్యపానం,ధూమపానం,జూదం వంటి వ్యసనాలకు బానిసయిన వారిని ఈ ఆలయానికి తీసుకు వచ్చి ప్రమాణం చేయిస్తే వారు ఆ వ్యసనాల జోలికి ఇక వెళ్ళారని ఆ చుట్టుపక్కల గ్రామస్తుల నమ్మకం. అలాగే మానసిక ఆరోగ్యం సరిగా లేనివారిని ఈ ఆలయానికి తీకుసువస్తే స్వస్థత చేకూరుతుందని కూడా నమ్ముతారు. మొక్కలు కడతారు చెల్లిస్తారు.గాంధీజీ జీవిత చరిత్ర వారికీ నిత్య  పారాయణ గ్రంధం. ఇక గాంధీజీకి ఒరిస్సాలో కూడా ఓ గుడి వుంది.



గాంధీజీ తన జీవితంలో ఒకేఒకసారి ఒరిస్సాలో పర్యటించారు. అయితేనేం అక్కడ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసారు గాంధీజీ వారినేంతగా ప్రభావితం చేశారంటే ఆ రాష్ట్రంలో సంబాల్పూర్ కూ సమీపంలో బాత్రా అనే గ్రామంలో ఆయనకో గుడి కట్టించారు. అక్కడ జాతీయపర్వదీనాలు పెద్ద పండగలుగా, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ గ్రామం చుట్టు పక్కల ఇప్పటికీ ఖాదీ మాత్రమే ధరిస్తారు. ఆ ఆలయం గోడలానిండా స్వాతంత్రోద్యమ ఘట్టాలు చెక్కించారు. 'రఘుపతి రాఘవ రాజారాం' అన్నా గీతాన్ని వారు నిత్యం స్మరిస్తారు.



మహాత్ముడికి గుడి కట్టడమెందుకని అడిగితే వారెంమంటారో తెలుసా...ఈ గుడిలో మేము మహత్ముడిని కాదు..మానవత్వాన్ని పూజిస్తున్నాం. గాంధీజీ జీవిత చరిత్ర మాకు నిత్య పారాయణ గ్రంథం..దాని నుంచి ఎంతో స్పూర్తి పొందుతాం. అందుకే ఆయన మాకు దేవుడు అంటారు. ఇంకా ఏమంటారో తెలుసా..''ఈ ఆలయాన్ని చూడగానే రక్తమాంసాలున్న ఇటువంటి మనిషి ఈ భూమ్మిద నడిచాడంటే ముందుతరాల వారు నమ్మరు..అన్న ఐన్ స్టీన్ మాటలు గుర్తుకు రావాలి అందరికి...అన్న వారి మాటలు మానవుడే మహనీయుడు అని నీరుపిస్తున్నాయి. ఆ మహనీయుడి స్పూర్తితో ముందడుగు వేద్దాం.

.....రమ

By
en-us Political News

  
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం
తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.