మీడియా ముందు భోరుమన్న కొండా సుశ్మిత

Publish Date:Sep 6, 2026

Advertisement

రేవంత్ తన కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడంపై తొలి సారిగా స్పందించిన కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మిత మీడియా ముందు భోరు మన్నారు. తన తల్లి మంత్రి పదవి పోవడానికి తానే కారణమంటో విలపించారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా   కొండా సురేఖ కుటుంబం తీరు ఉందనిఎద్దేవా చేస్తున్నారు.  

కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి  విధానాలపై కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మీత   విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సవాల్ విసిరారు. ఆమె వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు. 

దీనిపై కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఏ చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని, కానీ  న తల్లిని టార్గెట్ చేయడం   బాధాకరమని సుస్మిత మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. 

అయితే కిందపడ్డా నాదే పై చేయి అన్నచందంగా.. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాని చెప్పుకొచ్చారు. వాస్తవానికి సుశ్మీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ కనీసం ఖండిచకపోవడాన్ని మాత్రం సుశ్మీత ఈ సందర్భంగా విస్మరించారు. ఇక పోతే కొండా సుశ్మిత వ్యాఖ్యలు పార్టీని బహిరంగంగా సవాల్ చేశాయనీ, పార్టీలో అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండా.. బహిరంగంగా నాయకత్వాన్ని సవాల్ చేయడమే కొండా సురేఖపై వేటుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అటువంటి సుశ్మిత తన తల్లిపై చర్య తీసుకోవడం దారుణమంటూ ఇప్పుడు విలపించి ప్రయోజనం లేదని అంటున్నారు.    

 [Konda Susmitha Tears Bedore Media, Konda Surekha, Revanth Reddy, Telangana Congress, Cabinet dismissal, Telugu One]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.