ముందస్తుపై కేసీఆర్ డైలమా.. కమలం భయమే కారణమా?

Publish Date:Apr 18, 2022

Advertisement

తెలంగాణలో ముందస్తు  అన్నదే రాష్ట్రంలో  హాట్ టాపిక్. ముందస్తు ఎన్నికల కోసమే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు. ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందేందుకే...ఒక అడుగు వెనక్కు వేసి మరీ యాసంగి వడ్లు  కొనుగోలుకు ముందుకు వచ్చారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్  ముందస్తుకు వెళ్లడం ఖాయమే అయినా ఇప్పటికిప్పుడు ఆయనా ధైర్యం చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.  2023 మే లేదా 2022 డిసెంబర్ లో కేసీఆర్ ముందస్తుకు  వెళ్ళే అవకాశాలే అధికం.    బిజెపిని నిలువరించడం  కోసమే కేసీఆర్ ఈ ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎన్నికలు జరుగుతుంటే...మోత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా మోహరించి పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న జంకు కేసీఆర్ లో ఉంది. ఆలేరు ఉప ఎన్నిక తీసుకున్నా, హుజూరా బాద్ ఉప ఎన్నిక తీసుకున్నా...అంతకన్నా ముందు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలను చూసినా...అప్పట్లో దేశంలో మరెక్కడా ఎటువంటి ఎన్నికలూ జరగడం లేదు. దీంతో బీజేపీ కోర్ నేతలంతా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. దీంతో ఫలితం టీఆర్ఎస్కు ప్రతికూలంగా వచ్చింది. ఎన్నిక ఏదైనా, ఎప్పుడైనా విజయం మాదే అన్న టీఆర్ఎస్ విశ్వాసాన్ని కమలం వ్యూహాత్మకంగా దెబ్బతీసిన సందర్భాలవి. అందుకే కేసీఆర్ ముందస్తు ప్రణాళిక అత్యంత జాగ్రత్తగా  రచిస్తున్నారు. బీజేపీ కోర్ నాయకత్వం తెలంగాణపై కాన్ సంట్రేట్ చేయడానికి అవకాశం లేని సమయంలో ముందస్తు ఎన్నికలకు అడుగు వేసి లబ్ధి పొందాలన్నదే కేసీఆర్ యత్నంగా భావించాలి. అందుకే  కోసం 2022 చివరిలో, లేదా 2023 ప్రథమార్థంలో కేసీఆర్ ముందస్తుకు ముందుకు వస్తారని తెరాస శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  . 2022 డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రథమార్థంలో జరుగుతాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలో ఉంది.   వీటితో పాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే....బీజేపీ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ, దృష్టి పెట్టే అవకాశం ఉండదన్నది కేసీఆర్ భావనగా కనిపిస్తున్నది. అందుకే ఆ సమయంలో  ముందస్తుకు వెళితే రాజకీయంగా ఎదురుండదని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.    2018లో తెరాస ఎందుకు ముందస్తుకు వెళ్లిందో...ఇప్పుడు కూడా దాదాపు అదే కారణంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అప్పట్లో  2019లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళితే.. జాతీయ స్థాయి అంశాలు ప్రభావం చూపుతాయి. తద్వారా అధికార పార్టీకి   నష్టం జరిగే అవకాశాలు మెండు అని కేసీఆర్ భావించారు. అప్పుడు ఆ వ్యూహం కేసీఆర్ కు కలిసి వచ్చింది. మంచి మెజారిటీతో అధికారంలోనికి వచ్చింది. నాటి ఎన్నికలలో బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. 2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ   అదనంగా 4 ఎంపి సీట్లను కైవసం చేసుకుంది బిజెపి. అప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం ఫలించింది.  మరి ఇప్పుడు కేసీఆర్ ఏ వ్యూహంతో ముందస్తుకు వెళుతున్నారు? టీఆర్ఎస్ పూర్తిగా ఐదేళ్లు అధికారంలో కొనసాగి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా 2023 ద్వితీయార్ధం వరకూ సమయం ఉంది. 2023లో పార్లమెంట్ ఎన్నికలు లేవు. అయినా కేసీఆర్ ముందస్తు వ్యూహం ఎందుకంటే 2023లో పార్లమెంట్ ఎన్నికలు లేకున్నా...  ఆ సమయంలో దేశంలో మరే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కేవలం తెలంగాణ అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు జరగడం అంటూ జరిగితే..అప్పుడు బిజెపి ప్రచార దూకుడును ఎదుర్కోవడం అంత తేలిక కాదన్నది కేసీఆర్ భావనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచార దాడే నిదర్శనమని ఉదహరిస్తున్నాయి.  దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి   రాష్ట్ర నాయకత్వం అంతా మోహరించి ప్రచార భేరి మోగించింది.   జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో అయితే   బిజెపి జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగారు.  అమిత్ షా, స్మృతి ఇరానీ, జెపి నడ్డా, యోగి ఆదిత్యానాథ్, హేమంత్ బిస్వాస్ తో పాటు పలువురు సీనియర్ నేతలూ ప్రచారంలో భాగం పంచుకున్నారు. వారి ప్రచార వేడి పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.  ప్రజల దృష్టిని బీజేపీ వైపు మరల్చింది. పలితం అందుకు అనుగుణంగానే వచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అంటే బిజెపి జాతీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులే కాకుండా  ప్రధాని మోడీ కూడా విస్తృతంగా ప్రచారం చేసేందుకు వచ్చే అకాశాలు ఉన్నాయి.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మోడీ తన ఆహార్యాన్ని కూడా మార్చుకుని మరీ అక్కడ పలు మార్లు పర్యటించి ర్యాలీలలో పాల్గొన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితే కనుక తలెత్తితో మూడో సారి అధికారంలోకి రావాలన్న తన ఆకాంక్ష నెరవేరడం అంత సులభం కాదన్నదని గులాబీ బాస్ అంచనాగా కనిపిస్తున్నది.   దేశంలో మరెక్కడా  ఎన్నికలు లేకుండా ఒక్క తెలంగాణలోనే ఉంటే. బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణలోనే మోహరిస్తుందని  భావిస్తున్న కేసీఆర్  ఈ మారు గుజరాత్ లేదా కర్ణాటక ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగేలా ప్రణాళికా రచన చేస్తున్నారు.  ఎందుకంటే అప్పుడైతే  బిజెపి నాయకత్వం తెలంగాణపైన మాత్రమే ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండవు.   కర్ణాటక, గుజరాత్ లలో ఎన్నికలు ఉంటే  ఆ రాష్ట్రాలపైనే ఎక్కవ కాన్సన్ ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో విజయం పార్టీకి ప్రతిష్టాత్మకం అవుతుంది. అందుకే ఆ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలోనే మరీ  ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల వేళ తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలు కూడా జరిగితే  బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టే అవకాశాలుండవు.  అందుకే  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తథ్యం అన్న  విషయాన్ని ఇప్పటికే కేసీఆర్ పార్టీ కేడర్కు విస్పష్టంగా చెప్పేశారు. అయితే  ఆ ముందస్తు టైమ్ విషయంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా స్పష్టత ఇవ్వడం లేదు.  కర్ణాటక లేదా గుజరాత్ ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలే మెండు  అని పరిశీలకులు చెబుతున్నారు. ఇదెంత వరకూ వాస్తవమన్నది రానున్న రోజులలో  తేలుతుంది.

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.