జగన్ కు విషయం బోధపడిందా? ఆత్మకూరుపై టెన్షన్ అందుకేనా?

Publish Date:Jun 14, 2022

Advertisement

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయింది. ఈ మూడేళ్ల ఆయన పరిపాలన.. మూడునాళ్ల ముచ్చటగానే సాగిందనే ముచ్చట రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకోందా? ఈ విషయం సీఎం జగన్‌కి కూడా తెలిసిపోయిందా? అందుకే ఇటీవల పార్టీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో.. పలువురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని సీఎం జగన్ క్లియర్ కట్‌గా చెప్పేశారా? ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఏడుగురు మంత్రులతోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలను రంగంలోకి దించి.. సదరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వారిని  ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారా? అంటే సీఎం క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి మాత్రం అవుననే సమాధానం వస్తోందీ.

 మేకపాటి ఫ్యామిలీకి నెల్లూరు జిల్లాలోనే మంచి గుడ్ విల్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డిని.. పలుమార్లు లోక్‌సభ సభ్యుడిగా నెల్లూరు ప్రజలు గెలిపించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా తండ్రిలా అంతా సాఫ్ట్ అన్న విషయం కూడా విధితమే. 
2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గౌతమ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత  అంటే 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్ కేబినెట్‌లో అత్యంత కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా.. జగన్ పార్టీ గౌరవ మర్యాదలు ఎక్కడా తగ్గకుండా చూసుకొన్న అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో గౌతమ్ రెడ్డి ఉంటారనివైసీపీ వర్గీయులు చెప్పుకుంటారు. అలాంటి గౌతమ్ రెడ్డి.. ఆకస్మిక మరణం.. జగన్ పార్టీకి గట్టి దెబ్బేనని.. ఆ పార్టీలో  ఓ చర్చ అయితే బలంగా ఉందట.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. గౌతమ్ రెడ్డి చాలా డిగ్నిఫైడ్‌గా ఉండేవారని చెబుతుంటారు. అంతేకాదు.. వైసీపీలో మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్నినాని తాజా మంత్రి  ఆర్కే రోజాల వ్యవహారశైలికి గౌతమ్ రెడ్డి వ్యవహార శైలికి నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంటుందనే ఓ చర్చ కూడా పార్టీలో గట్టిగానే సాగుతోంది.  

 అలాంటి మేకపాటి ఫ్యామిలీ నుంచి  విక్రమ్ రెడ్డి ఈ ఉప ఎన్నికల బరిలో నిలిస్తే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని వైసీపీయే కాక విపక్షాలు కూడా భావిస్తున్నాయి. మరి అలాంటి వేళ.. ఇంత మంది మంత్రులు, ఇంత మంది ఎమ్మెల్యేలను ఈ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఎందుకు దింపారని వైసీపీ నేతల్లోనే కాదు.. విపక్ష తెలుగుదేశంలోనూ సందేహం వ్యక్తం అవుతోంది. పైగా ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీ ఉనికి జిల్లాలో నామమాత్రమే. అయినా ఆత్మకూరు ఉప ఎన్నిక విజయంపై జగన్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారన్న ప్రశ్నకు   ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని... జగన్ కు బాగానే అర్థమైందని అందుకే.. ఇంతలా.. మంది మార్బలాన్ని  ఈ ఉప ఎన్నికకు మోహరించారని పార్టీ వర్గీయులే అంటున్నారు.

మరోవైపు మేకపాటి ఫ్యామిలీపై అభిమానం ఉన్నా.. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు కాస్తా.. బీజేపీకి పడితే.. ఫలితం తారుమారు అయి.. పొరుగున ఉన్న తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు లాంటి సీన్ రిపిట్ అయితే.. పరువు పెన్నానదిలో కలుస్తుందని జగన్ భయపడుతున్నట్లు చెబుతున్నారు. 

ఇంకోవైపు  వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు   అనైక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందట. ఇది నెల్లూరు జిల్లాలో అయితే ఈ అనైక్యత ముదిరి పాకన పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిందరినీ ఏక తాటిపైకీ తీసుకు వచ్చి..  ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్‌ విధించారని సమాచారం. దీంతో ఇన్ చార్జ్‌లుగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. తమ టాలెంట్ జగన్‌కి చూపించాలని ఉబలాటపడుతున్నారట. మరి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల చిత్తంలో ఏముందనేది మాత్రం అర్థం కావడం లేదని ఫ్యాన్ పార్టీ నేతల్లో ఓ గుసగుస మొదలైంది.          

 ఇక ఈ ఉప ఎన్నికకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం తమ పార్టీ అభ్యర్థిని నిలిపింది. ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు నిలిచారు. ఆత్మకూరు ఉప ఎన్నిక జూన్ 23న జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 26న వెలువడనుంది.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.