జగన్ దీక్ష భగ్నం
Publish Date:Aug 31, 2013
Advertisement
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరవధిక దీక్ష చేస్తున్న నేపథ్యంలో దీక్ష విరమింపజేయాలని జైళ్ల శాఖ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీక్ష విరమణకు ఒప్పుకోకుంటే బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని సూచించింది. జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా ఆయన వైద్యానికి సహకరించడం లేదని నిమ్స్ వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో జైళ్ల శాఖ ఆదేశాలిచ్చింది. జగన్ ఆరోగ్యం మెరుగుపడాలంటె బలవంతంగా అయినా గ్లూకోజ్ ఎక్కించక తప్పదని నిమ్స్ వైద్యులు నగేష్ తెలిపారు. ఇప్పుడు ఒక్కసారి ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలు పెడితే నాలుగు రోజుల పాటు సాగుతుందని, ఆ తరువాత ఎన్ని రోజులు అలా అనేది చెప్పలేమని తెలిపారు. జగన్ దీక్ష నేటికి ఏడో రోజుకు చేరింది. ఆయన నిలబడితే బీపీ పడిపోతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ తో పాటు కిడ్నీ పారామీటర్స్ కూడా తగ్గిపోయాయని డాక్టర్ శేషగిరి ఆధ్వర్యంలో చేసిన వైద్య పరీక్షల వివరాలను బులెటిన్ లో వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/-jagan-deeksha-39-25480.html





